ఎస్పీబీ పేరిట ప్రత్యేకమైన పార్కు

14 Dec, 2020 03:05 IST|Sakshi

బాలు పాడిన పాటల పేర్లతో చెట్లు 

ఈ ఏడాది సెప్టెంబర్‌ 25న గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం కనుమరుగయ్యారు కానీ పాటల రూపంలో అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. ఆయనకు నివాళిగా తమిళనాడులోని కోయంబత్తూరులో ‘సిరు తుళి’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ‘ఎస్‌.పి.బి. వనం’ పేరిట ఓ ప్రత్యేకమైన పార్కును ఏర్పాటు చేసింది. అక్టోబర్‌లో ఈ వనం రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. గత వారం ఆవిష్కరించారు. చనిపోయే నాటికి బాలు వయసు 74. ఈ వనంలో మొత్తం 74 మొక్కలు నాటారు.

ఒక్కో మొక్కకు బాలు పాడిన ఓ పాటను పేరుగా పెట్టడం విశేషం. మొక్కలన్నింటినీ ‘ట్రెబల్‌ క్లెఫ్‌’ (సంగీత స్వర చిహ్నం) ఆకారంలో నాటారు. అలాగే సంగీత వాద్యాలు తయారు చేసే చెట్లకు సంబంధించిన మొక్కలివి. కోయంబత్తూరు శివార్లలో పచ్చప్పాళయంలో 1.8 ఎకరాల ఈ వనంలో లైబ్రరీ, పిల్లలు ఆడుకోవడానికి పార్క్, ఇంకా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామని ‘సిరు తుళి’ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, ఈ వనం ఆవిష్కరణ వేడుకలో బాలు కుమారుడు ఎస్‌.పి. చరణ్, సోదరి ఎస్‌.పి. శైలజ వర్చ్యువల్‌గా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు