Bandla Ganesh: స్టేజీపై బాగా నటించావ్‌.. శభాష్‌ బండ్ల గణేష్‌!

1 Nov, 2023 14:46 IST|Sakshi

తెలుగు ఇండస్ట్రీలో నవ్వు పుట్టించగల ఎక్స్‌ట్రీమ్ కేరక్టర్లు బోలెడు మంది ఉన్నారు.. కానీ వారందరిలో బండ్ల గణేష్‌ చాలా స్పెషల్‌. సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. రంగం ఏదైనా సరే వివాదాల్ని ఇలా రేపడం, అలా వాటిని వదిలేయడం బండ్ల గణేశ్‌కు బట్టర్‌తో పెట్టిన విద్య. ఒక్కోసారి బండ్ల వ్యాఖ్యలు విన్నవారు  చిన్నప్పుడే చిప్ కొట్టేసిందా, లేక చిప్ లేనేలేదా అంటూ కామెంట్లు చేస్తుంటారు.

డేగల బాబ్జీకి ఇవన్నీ చాలా కామన్‌ 
ఎప్పుడైనా వేదిక ఎక్కినప్పుడు ఆయన చేసే ప్రసంగాలు చూస్తే, వింటే ఇండస్ట్రీ మీదే జాలేస్తుంది. ఎందుకంటే.. ఎలా భరించారో ఇలాంటి కమెడియన్‌ని అని. అంతెందుకు..? తను ఎంత సీరియస్‌గా మాట్లాడినా కూడా మీడియా ఓ  జోకర్‌గానే పరిగణిస్తుంది. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు తనంతట తను నెత్తిమాశిన ట్వీట్లు వేసి, నెటిజన్లతో తిట్లు తింటుంటాడు. పాఫం, కొన్నాళ్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కూడా ఉద్దరించినట్టున్నాడు. పార్టీ కండువా కప్పుకోవడమే ఆలస్యం.. తమ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, లేకపోతే తాను 7 O’clock బ్లేడుతో గొంతు కోసుకుంటానని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్‌గా అప్పుడు నిలిచాడు. తీరా ఎన్నికల్లో ఓడిపోయాక, ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు బండ్ల.

అప్పట్నుంచే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.  పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నానని బండ్ల గణేష్ ట్విటర్(ఎక్స్‌) మాధ్యమంగా అప్పట్లో ప్రకటించాడు. తర్వాత తనకు కేవలం సినిమాల మాత్రమే తెలుసని వాటి మీదనే ఇకనుంచి దృష్టి పెడుతానని చెప్పాడు. కానీ మనోడి గురించి తెలిసిందే కదా పెద్ద కమెడియన్‌ పీస్‌ అని.. కనీసం ఏ కుర్ర హీరో కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో చేసేది ఏమీ లేక స్వీయ నటనతో 'డేగల బాబ్జీ' అనే ఒక తలమాశిన సినిమా తీసి ప్రేక్షకులపైన పగతీర్చుకున్నాడు. అలా సినిమాతో పాటు రాజకీయం కూడా ఫుల్‌స్టాప్‌ పడింది.

భజనకు కేరాఫ్‌ బండ్ల
భజన చేయడంలో బండ్లను మించినవాడు లేడు. స్టైజ్‌పై మైకు దొరికితే చాలు.. ఊగిపోతుంటాడు. తాజాగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలో టీడీపీ ఏర్పాటు చేసిన ఒక సభలో  7 O’clock బ్లేడు లాంటి డైలాగ్‌లతో పాటు ఆస్కార్‌ను మించేలా నటించాడు. లేదు.. లేదు.. చంద్రబాబు కోసం గుక్కపెట్టి ఏడ్చాడు. అసలే బండ్ల పెద్ద కమెడియన్‌ అని తెలిసిందే.. ఆయనకు  ఏడుపు ఎలా కనెక్ట్‌ అవుతుంది. అందుకే బండ్ల ఏడుస్తున్నా అక్కడ కూర్చొని ఉన్న వారందరీ ఫేసుల్లో నవ్వులు కనిపించాయి. తాజాగా ఆయన చంద్రబాబు కోసం చచ్చిపోతా.. ఆయనకు కమీషన్‌గా రక్తాన్ని ఇస్తా అంటూ తన కేరక్టర్‌కు  ఏ మాత్రం సెట్‌ కాని వ్యాఖ్యలు చేశాడు.. గతంలో 7 O’clock బ్లేడుతో కోసుకుంటా అన్నాడు.

ఒక్కోసారి పవన్‌ కల్యాణ్‌ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు. జూ ఎన్టీఆర్‌ కోసం ప్రాణాలకు తెగిస్తా అంటాడు. ఇన్నన్నీ సార్లు ఈ వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేస్తాడంటే వీరందరి నుంచి ఏదో ఒక లబ్ధి పొందేందుకే అని తెలిసిందే. ఈ భజన కేరక్టర్‌ గురించి తెలిసే జూ. ఎన్టీఆర్‌ ఎప్పుడో పక్కన పెట్టేశాడు. ఇక తనకు మిగిలింది పవన్‌,బాబు అండ్‌ కో బ్యాచ్‌ మాత్రమే.. వారిని ఇలా ప్రసన్నం చేసుకునేందుకే ఇలా దొంగ జపం చేస్తున్నాడు. బండ్లన్న కోళ్ల వ్యాపారం కోసం గతంలో చంద్రన్న అండగా నిలబడ్డాడట. ఆ రెస్పాన్సిబిలిటీతోనే బండ్ల ఇప్పుడు ప్రాణాలైనా ఇస్తానంటూ చంద్రబాబు గ్రాట్యుటీ చూపిస్తున్నాడని టాక్‌. రేపు ఎవరన్నా ఒక మంచి ఆఫర్ ఇస్తే ' నవ్వుతానే ఊరుకోండి సార్ స్టేజీపైన పూనకంతో ఎన్నో అంటుంటాం ఛీ.. ఛీ చంద్రబాబు కోసం నేను ప్రాణాలు ఇవ్వడం ఏంటి అనేస్తాడు.. అలాంటి కల్లర్స్‌ ఉన్న వూసరవెల్లి అని తెలిసిందే.

తారక్‌, రవితేజ, పూరి ఆ లిస్ట్‌లో ఎందరో 
తన జీవితంలో ఎప్పుడూ రెండు నాల్కల ధోరణి చూపించే బండ్ల గణేశ్.. గతంలో తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులను తిట్టినతిట్టూ లేకుండా వాగాడు.. ఎప్పుడైతే తన రాజకీయం బెడిసికొట్టిందో వెంటనే వారందరినీ ఎడాపెడా పొగిడేశాడు.  సినిమా ఇండస్ట్రీలో రవితేజ, పూరి జగన్నాథ్‌ను మోసం చేశానని చెప్పుకొచ్చాడు. టెంపర్‌ సినిమా సమయంలో తారక్‌తో రెమ్యునరేషన్‌ గొడవ కూడా అప్పట్లో వైరల్‌ అయింది.

తర్వాత అన్నదమ్ముల మధ్య ఇలాంటివి సహజం అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తారక్‌ 'దేవర' సినిమా ప్రకటించిన తర్వాత ఆ టైటిల్‌ తనదని ఒక ట్వీట్‌ పడేశాడు. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ బండ్లపై పెద్ద వార్‌కు దిగారు. ఆ దెబ్బకు తారక్‌ నాకు కూడా దేవరే అంటూ వారిని బతిమాలి ఆ గొడవ నుంచి బయటపడ్డాడు. ఇలా ఆయన జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బండ్ల గణేశ్‌ గ్యారేజీలోకి చంద్రబాబు వచ్చి ఆగాడు అంతే తేడా..!

మరిన్ని వార్తలు