బ్యాంక్‌ రెడీ అవుతోంది!

3 Dec, 2020 00:16 IST|Sakshi

మహేశ్‌ బాబు కోసం ఓ బ్యాంక్‌ రెడీ అవుతోంది. నెల రోజుల పాటు మహేశ్‌ ఈ బ్యాంక్‌కి వెళుతుంటారు. ఇంతకీ బ్యాంక్‌ కథ ఏంటీ అంటే.. ‘సర్కారువారి పాట’లో మహేశ్‌బాబు బ్యాంక్‌ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారనే వార్త వినపడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో బ్యాంక్‌ సెట్‌ వేస్తున్నారని సమాచారం. ఈ సెట్‌లో నెల రోజుల చిత్రీకరణ ప్లాన్‌ చేశారట. వచ్చే నెల ఈ షూటింగ్‌ ప్రారంభమయ్యే చాన్స్‌ ఉంది. ముందు అమెరికా షెడ్యూల్‌ జరిపి, ఆ తర్వాత ఇక్కడ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. కానీ కరోనా వల్ల ప్లాన్‌ మారింది. ముందు ఈ సెట్‌లో షూట్‌ చేసి, మార్చిలో అమెరికా షెడ్యూల్‌ ప్రారంభించాలనుకుంటున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు