నా చీర కట్టు నాకు ఇష్టం

19 Feb, 2023 12:47 IST|Sakshi

దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురుగా సినీరంగలోకి అడుగుపెట్టిన కళ్యాణీ ప్రియదర్శన్‌.. ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలే అయినా తన ప్రత్యేకతతో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ ప్రత్యేకతే ఆమెను ఫ్యాషన్‌ ఐకాన్‌గానూ నిలబెడుతోంది ఇలా.. 

నా చీర కట్టు అంటే నాకు చాలా ఇష్టం. చీర కట్టుకున్న ప్రతిసారీ నన్ను నేను కౌగిలించుకున్నట్లు అనుభూతి చెందుతాను.
– కళ్యాణీ ప్రియదర్శన్‌. 


జేడ్‌ బై మోనికా అండ్‌ కరిష్మా
బ్రైడల్‌ కలెక్షన్స్‌కు పెట్టింది పేరు ఈ బ్రాండ్‌. తమలోని ఫ్యాషన్‌ స్పృహ, భారతీయ హస్తకళల పట్ల తమకున్న మక్కువ, గౌరవాలకు ప్రతీకగా దీన్ని స్థాపించారు మోనికా షా, కరిష్మా స్వాలి. భారతీయ సంప్రదాయ నేతకళకు ఆధునిక ఆకృతులు, రంగులు, హంగులు అద్దుతున్నారు. జేడ్‌ బై మోనికా అండ్‌ కరిష్మా బ్రాండ్‌.. పేరుకు దేశీయమైనా ఫ్యాషన్‌ రంగంలో అంతర్జాతీయ కీర్తిని సొంతం చేసుకుంటోంది. ధరలనూ అంతే స్థాయిలో అంచనా వేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లభ్యం. 

కళ్యాణ్‌ జ్యూయెల్స్‌
దేశంలోనే అతిపెద్ద జ్యూయెలరీ బ్రాండ్స్‌లో ఒకటి ఈ కళ్యాణ్‌ జ్యూయెల్స్‌. 1908లో ప్రారంభమైన ఈ సంస్థకు ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో మొత్తం 150 బ్రాంచ్‌లున్నాయి. సరికొత్త డిజైన్సే కాదు కొనుగోలుదారుల నమ్మకం కూడా ఈ బ్రాండ్‌కు యాడెడ్‌ వాల్యూ. నాణ్యత, డిజైన్‌ బట్టే ధరలు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. 

జ్యూయెలరీ
బ్రాండ్‌:  కళ్యాణ్‌ జ్యూయెల్స్‌
ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

చీర బ్రాండ్‌: 
జేడ్‌ బై మోనికా అండ్‌ కరిష్మా
ధర:రూ. 96,500

మరిన్ని వార్తలు