సినీ పండగ కళ

14 Jan, 2021 03:46 IST|Sakshi

సంక్రాంతి మనకు పెద్ద పండగ. సినిమావాళ్లకు ఇంకా పెద్ద పండగ. ఆల్రెడీ థియేటర్స్‌లో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. త్వరలో రాబోయే సినిమాల మీటరేంటో.. మ్యాటరేంటో.. పోస్టర్స్, ప్రోమో రూపంలో వచ్చాయి. సంక్రాంతికి సందడి తీసుకొచ్చిన సినిమాల విశేషాలేంటో చూద్దాం.

► రవితేజ డబుల్‌ యాక్షన్‌ చేస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడీ’. రమేశ్‌ వర్మ దర్శకుడు. సంక్రాంతి స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.
► 2019లో ‘ఎఫ్‌2’కి  సంక్రాంతి అల్లుళ్లుగా సందడి చేశారు వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ ‘ఎఫ్‌ 3’ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసారి ఈ తోడల్లుళ్ల ఫుల్‌ టార్గెట్‌ డబ్బు సంపాదనే అట. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని  ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు.
► విష్ణు మంచు హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌ అగర్వాల్, రుహానీ శర్మ ముఖ్య పాత్రలు చేశారు. భారీ ఐటీ స్కామ్‌ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు జెఫ్రీ చిన్‌ దర్శకుడు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.
► ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’గా మారారు అఖిల్‌. పూజా హెగ్డే జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకుడు.
► సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతీ శెట్టి కథానాయిక. విజయ్‌ సేతుపతి విలన్‌. బుచ్చిబాబు సన దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ బుధవారం విడుదలయింది.
► రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకుడు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నట్టు కొత్త పోస్టర్‌ ద్వారా ప్రకటించారు.
► మాఫియా నేపథ్యంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘కబ్జా’. ఆర్‌. చంద్రు దర్శకుడు. ఈ సినిమాలో సుదీప్‌ కీలక పాత్రలో నటించనున్నారు. సుదీప్‌ లుక్‌ను విడుదల చేశారు.
► బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లాక్‌ రోజ్‌’. మోహన్‌ భరద్వాజ్‌ దర్శకుడు. సంక్రాంతికి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
► ‘వెయ్యి అబద్ధాలు ఫేమ్‌ ఎస్తేర్‌ ముఖ్య పాత్రలో ‘హీరోయిన్‌’ అనే సినిమా ప్రకటించారు. తిరుపతి ఎస్‌ఆర్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఎస్తేర్‌ శృంగార తారగా నటించనున్నారు.
► వశిష్ట సింహా, హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ పోస్టర్‌ విడుదలయింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా