నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: వెండితెరపై హీరోయిన్ల విశ్వరూపం!

28 Sep, 2022 16:26 IST|Sakshi

సినిమాని తీసే తీరులో మార్పొచ్చింది. చూసే విధానంలోనూ ఛేంజ్ కనిపిస్తోంది. బడ్జెట్ పెరిగింది. క్రియేటివిటీ పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. కానీ హీరోయిన్ని గ్లామర్ డాల్‌గా చూసే పద్ధతిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ దొరుకుతుంది. అప్పుడు వాళ్లు తమ విశ్వరూపం చూపిస్తే దశాబ్దాల పాటు ఆ నటనని ప్రేక్షకులు గుర్తు చేసుకుని మరీ ఆనందిస్తారు. అభినందిస్తారు. ఫెర్ఫా మెన్స్ స్కో ప్ ఉన్న క్యారెక్టర్ దొరికితే అదరహో అనేలా ఆ పాత్రకి జీవం పోసిన హీరోయిన్స్‌ని ఒకసారి చూసేద్దామా?

అందం అభినయం. ఇవి రెండు కలిస్తే శ్రీదేవే. గ్లామర్ యాంగిల్లో శ్రీదేవికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో యాక్టింగ్ పరంగా అంతకు మించిన పేరుంది. అయినానిజానికి నటనపరంగా తన సామర్థ్యాన్ని చూపించే అవకాశం చాలా సినిమాల్లో శ్రీదేవికి లభించింది. అయితే... వసంత కోకిల చిత్రంలో పోషించిన విజయ పాత్ర శ్రీదేవి నటజీవితంలోనే మైలు రాయి. ఆరు ఏళ్ల వయ స్సు పిల్ల మైండ్‌లో ఉన్న ఇరవై ఏళ్ల యువతిగా అద్భుతంగా నటించింది శ్రీదేవి.

హోమ్లీ క్యారెక్టర్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే నటి సౌందర్య. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అతి తక్కువ కథానాయికల్లో సౌందర్య ఒకరు. పర్ఫార్మెన్స్‌ స్కోప్ ఉన్న చాలా పాత్రల్లో సౌందర్య నటించారు. కానీ అంతఃపురంలో భానుమతి క్యారెక్టర్ మాత్రం నిజంగానే ఛాలెంజింగ్ క్యారెక్టర్. కానీ అక్కడ ఉన్నది సౌందర్య. ఇక చెప్పేదేముంది వెండితెర మీద విశ్వరూపమే చూపించింది.

అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్న పేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భు తంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీనరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. గర్వం, పొగరు ఉన్న జమీందారు కూతురు పాత్రలో జీవించేసింది రమ్యకృష్ణ. తనదైన నటనతో నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది.

ఛాలెంజింగ్ పాత్రల గురించి చెప్పుకునేటప్పుడు మంచు లక్ష్మీ పేరుని మిస్ అవడానికి వీల్లేదు కదా. గుండెల్లో గోదారి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాల్లో మంచు లక్ష్మీ పెర్ఫామెన్స్ అందరి ప్రశంసలు అందుకుంది. గుండెల్లో గోదారి చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. గోదావరి యాసలో డైలాగ్‌ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రంలో ముసలమ్మగా డీగ్లామరైజ్ రోల్ బాగా యాక్ట్ చేసింది.

చదవండి: 
నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో

మరిన్ని వార్తలు