స్పైడర్‌ మ్యాన్‌-నో వే హోమ్‌ పోస్టర్‌ విడుదల.. ఇవి గమనించారా..!

8 Nov, 2021 17:05 IST|Sakshi

హాలీవుడ్‌ మోస్ట్‌ అవేయిటెడ్‌ మూవీ స్పైడర్‌ మ్యాన్‌- నో వే హోమ్ అధికారిక పోస్టర్‌ను సోనీ పిక్చర్స్‌, మార్వెల్‌ స్టూడియోస్‌ సంస్థలు విడుదల చేశాయి. స్పైడర్‌ మ్యాన్‌గా టామ్‌ హోలాండ్‌, డాక్టర్‌ ఆక్టోపస్‌గా ఆల్‌ఫ్రెడ్‌ నటిస్తున్నారు. ఈ పోస్టర్‌లో డాక్టర్‌ ఆక్టోపస్‌ను చూపించకున్న తన మెటల్‌ అవయవాలు పీటర్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ పోస్టర్‌ విడుదల స్పైడర్‌ మ్యాన్‌ అభిమానులను పెద్దగా ఆశ్చర్యపర్చకున్నా.. అందులోని కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. 

పోస్టర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్‌ గాబ్లిన్‌ (విలియమ్‌ డాఫో) తన ఐకానిక్‌ గ్లైడర్‌పై రైడ్‌ చేయడం చూడొచ్చు. పోస్టర్‌లోని మెరుపులు ‘ఎలక్ట్రో’ కు సూచనగా కనిపిస్తున్నాయి. అలాగే మేఘం లాంటి ధూళి రేణువులను బట్టి చూస్తే 'సాండ్‌ మ్యాన్‌' కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు ఊహించినట్లేం ‘సినిస్టర్‌ సిక్స్’ విలన్లు ఈ స్పైడీ మూవీలో ఉంటారనడానికి ఇది సాక్ష్యంగా మారింది. 
 


అత్యంత శక్తివంతమైన నలుగురు విలన్లు మూవీలో ఉన్నట్లు పోస్టర్‌ ద్వారా తెలుస్తోంది. అయితే కామిక్‌ పుస్తకాల నుంచి తీసుకొని అయిన నో వే హోమ్‌ చిత్రంలో ‘సినిస్టర్‌ సిక్స్‌’ విలన్లను చూపిస్తారో లేదో వేచి చూడాలి. 
 

మరిన్ని వార్తలు