నా సెకండ్‌ ఇన్నింగ్స్‌కి గుర్తింపు తెచ్చే సినిమా ఇది : సాయికుమార్‌

29 Jul, 2021 15:32 IST|Sakshi

‘‘నా సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమాల్లో ‘పోలీస్‌ స్టోరీ, ప్రస్థానం’ ఉన్నాయి. నా యాభై ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటి వరకు పోషించిన పాత్రలు నా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌కి వైభవాన్ని తీసుకొచ్చాయి. నా సెకండ్‌ ఇన్నింగ్స్‌కి అద్భుతమైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండంపం’ ఉంటుంది’’ అని నటుడు సాయికుమార్‌ అన్నారు.

కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 6న విడుదల కానుంది. కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘కుటంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. సాయికుమార్‌ వంటి గొప్ప నటుడితో నేను పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా సినిమాని రిలీజ్‌ చేస్తున్న శంకర్‌ పిక్చర్స్‌ వారికి ధన్యవాదాలు’’ అన్నారు.

మరిన్ని వార్తలు