SR Kalyanamandapam: అతిథులుగా అల్లరి నరేశ్‌, కార్తికేయ

5 Aug, 2021 07:48 IST|Sakshi

SR Kalyanamandapam Pre Release Event: ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం ట్రైలర్‌ చూస్తుంటే సెన్సేషనల్‌ హిట్‌ మూవీ తీయాలనే తపన దర్శక, నిర్మాతలు, హీరోలో కనిపించింది. మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి అన్నారు. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా సాయికుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం. శ్రీధర్‌గాదె దర్శకత్వంలో ప్రమోద్‌, రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది.

ప్రీ రిలీజ్‌ వేడుకలో జీవితా రాజశేఖర్‌, అల్లరి నరేశ్‌, కార్తికేయ అతిథులుగా పాల్గొన్నారు. ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే కథతో రాయలసీమ నేపథ్యంలో సినిమా సాగుతుంది అన్నారు శ్రీధర్‌ గాదె. ఇది మన మధ్య తరగతి కథ అన్నారు కిరణ్‌ అబ్బవరం. ప్రతి తండ్రీ కొడుకు కలిసి చూడాల్సిన సినిమా అన్నారు ప్రమోద్‌, రాజు. ఫిలిం ఛాంబర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ముత్యాల రాందాస్‌, నిర్మాత రాజ్‌ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు