Arjuna Phalguna: అర్జున ఫల్గుణ ట్రైలర్‌ వచ్చేసింది..

24 Dec, 2021 18:35 IST|Sakshi

Arjuna Phalguna Trailer: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్‌ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్‌ కొరటాల శివ శుక్రవారం అర్జున ఫల్గుణ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

ఇందులో అర్జున పాత్రలో ఒదిగిపోయిన శ్రీ విష్ణు యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించాడు. ట్రైలర్‌లో ఇంకా ఎన్నాళ్లు ఖాళీగా ఉంటావన్న ప్రశ్నకు హీరో రియాక్ట్‌ అవుతూ 'డిగ్రీదాకా చదివాం.. ఆర్నెళ్లు రెస్ట్‌ తీసుకుంటే తప్పా?' అని చెప్పిన డైలాగ్‌ యూత్‌కు కనెక్ట్‌ అవుతోంది. ఇక హీరోయిన్‌ అమృత గ్రామ వాలంటీర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 50 శాతం అడవుల్లోనే షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమా ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని వార్తలు