ఓటీటీలో శ్రీకారం: రేపటి నుంచే ప్రసారం

15 Apr, 2021 09:52 IST|Sakshi

యువ కథానాయకుడు శర్వానంద్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'శ్రీకారం'. ఈ సినిమా బాగుందంటూ ప్రశంసలైతే దక్కాయి కానీ కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో ఈ సినిమా కూడా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. పైగా అప్పుడు 'జాతిరత్నాలు' కూడా థియేటర్లలో ఆడుతుండటంతో శ్రీకారం దాని పోటీ తట్టుకోలేక ఫెయిల్‌ అయింది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్‌ అవుతోంది. సన్‌నెక్స్ట్‌ యాప్‌లో ఏప్రిల్‌ 16 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయిన వారు రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూసేయండి..

ఇదిలా వుంటే జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆహా, క్రాక్‌, నాంది ఆహాలో ప్రసారం అవుతుండగా తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాలు కూడా వరుసగా ఈ నెల 16, 23 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

చదవండి: శర్వానంద్‌ సినిమా బాగున్నా కలెక్షన్లు రావట్లే

ఆహాలో చావు కబురు చల్లగా, మరికొత్త సినిమాలు..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు