రవితేజ, విజయ్‌ దేవరకొండలను పక్కన పెట్టేసిన శ్రీలీల.. నిజమా?

25 Sep, 2023 11:48 IST|Sakshi

పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ అందం శ్రీలీల జోరు మామూలుగా లేదు. టాప్‌ హీరోలు నటిస్తున్న పలు చిత్రాల్లో ఆమే కథానాయికగా ఉంది. ఇప్పటికే ఆమె ఓకే చేసిన చాలా చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఇందులో భాగంగా  రామ్‌ పోతినేనితో ఆమె నటించిన స్కంద చిత్రం సెప్టెంబర్‌ 28న విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: నా జీవితంలో ఆ ముగ్గుర్నీ ఎప్పుడూ మర్చిపోను: రాఘవ లారెన్స్)

రవితేజ ‘ధమాకా’  తర్వాత ఏక కాలంలో దాదాపు పదికి పైగా చిత్రాలను ఓకే చేసిన ఈ బ్యూటీ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప-2 కోసం ఐటమ్‌ సాంగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతలా బిజీగా ఉన్న శ్రీలీల  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రంలో శ్రీలీలను హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా ఫిక్స్ చేశారు. ఈ మూవీ ఇప్పటికే సెట్స్‌‌‌‌‌‌‌‌పై ఉంది. కానీ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీలో ఉన్న శ్రీలీల ఈ సినిమా షూట్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ కాలేకపోతుందట. దీంతో ఆమె స్వయంగా రౌడీ సినిమా నుంచి బయటికొచ్చేసిందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు రవితేజ కూడా శ్రీలీలతో 'ధమాకా' సూపర్‌ హిట్‌ ఇచ్చాడు. మళ్లీ ఇదే జోష్‌లో మరో ప్రాజెక్ట్‌ చేయాలని రవితేజ అనుకున్నారట. అందుకు శ్రీలీల వద్ద ఇప్పట్లో డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయడం కష్టమని చెప్పిందట. స్టార్‌ హీరోలతో బంగారం లాంటి అవకాశాలు వచ్చినా చేయలేకపోయానే అని బాధపడుతుందట ఈ బ్యూటీ. దీనంతటికి ప్రధాన కారణం తన ఎంబీబీఎస్ చదువుకు సంబంధించిన పరీక్షలు  డిసెంబర్ నెలలో ఉండటమే అని తెలుస్తోంది. పరీక్షల కోసం ఆమె సినిమాలకు రెండు నెలలపాటు బ్రేక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణం వల్లే  ఆ రెండు చిత్రాలు చేయలేనని శ్రీలీల చెప్పిందట. దీనికి వారు కూడా సానుకూలంగానే స్పందించారట.

మరిన్ని వార్తలు