‘పక్క అపార్ట్ మెంట్‌లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి’

16 Aug, 2021 09:03 IST|Sakshi

యాంకర్‌ శ్రీముఖి, గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్‌’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్‌ సినిమా గ్రూప్స్, గ్రీన్‌ మెట్రో మూవీస్, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో యాంకర్లు ప్రదీప్, అనసూయ బిగ్‌ టికెట్‌ను విడుదల చేయగా, నిర్మాత కె.ఎస్‌.రామారావు, రైటర్‌ కోన వెంకట్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇ. సత్తిబాబు మాట్లాడుతూ.. ‘మా క్రేజీ అంకుల్స్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఎలా ఉండబోతుందనేదే ఈ సినిమా. ఈ ముగ్గురితో శ్రీముఖి ఎలాంటి మ్యాచ్‌ ఆడించిందనేది క్రేజీగా ఉంటుంది. అది సినిమాలో చూడాల్సిందే’ పేర్కొన్నాడు.

ఇక శ్రేయాస్‌ శ్రీను మాట్లాడుతూ.. ‘మా ‘క్రేజీ అంకుల్స్‌’ రిలీజ్‌కు సపోర్ట్‌ చేస్తున్న గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, ‘దిల్‌’ రాజులకు ధన్యవాదాలు తెలిపాడు. వ్యాపారాలు చేసుకునే ముగ్గురు భర్తలను భార్యలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందనే పాయింట్‌తో ఈ సినిమాను సరదాగా తెరకెక్కించామని నిర్మాత శ్రీనివాస్‌ అన్నాడు. కోన వెంకట్‌ మాట్లాడుతూ.. నాకు ఎంతో కావాల్సిన అతి కొద్ది మందిలో శ్రీను ఒకడు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’ అని పేర్కొన్నాడు. కాగా పక్క అపార్ట్ మెంట్‌లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపిస్తుండగా, ఆమెను ప‌డేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ ఎలాంటి తిప్ప‌లు ప‌డుతున్నార‌నేదే కథ. 

మరిన్ని వార్తలు