నా వయసు ఇంకా అయిపోలేదంటూ పెళ్లిపై శ్రీముఖి క్లారిటీ

22 Jun, 2021 20:14 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి బుల్లితెరపై తన అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తుంది. ఏ కార్యక్రమంలో అయిన శ్రీముఖి ఉంటే ఆ జోషే వేరు. తనదైన కామెడీ పంచులతో స్టేజ్‌పై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి సోషల్‌ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బుల్లి బుల్లి నెక్కర్లపై చిందేలేస్తూ, తరచూ అభిమానులతో చిటిచాట్‌ చేస్తూ లాక్‌డౌన్‌లో నెటిజన్లకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించింది.

ఈ నేపథ్యంలో తాజాగా శ్రీముఖి అభిమానులతో మరోసారి ముచ్చటించింది. ఈ క్రమంలో వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా డిప్రెషన్‌ గురించి కూడా పలు అసక్తికర విషయాలను పంచుకుంది. ఇక తన పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నించిన ఓ అభిమానిపై మాత్రం కాస్తా ఫైర్‌ అయ్యింది ఈ రాములమ్మ. అయితే ఇంతకుముందు కూడా తన పెళ్లిపై వచ్చిన ప్రశ్నలకు చమత్కారిస్తూ సమాధానం ఇచ్చిన శ్రీముఖి ఈసారి కొంత అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘అందరి దృష్టి నా పెళ్లిపైనే ఉంది. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అలాగే నా వయసేం అయిపోలేదు. ప్రస్తుతం సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న. ఇలాంటివన్నీ వదిలేయండి’ అంటూ కాస్తా గట్టిగానే సమాధానమిచ్చింది శ్రీముఖి.

చదవండి: 
నన్ను పెళ్లి చేసుకుంటావా?: పాట రూపంలో శ్రీముఖి రిప్లై

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు