Arangetram Movie: ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురబ్బాయిల మధ్య సాగే కథ!

27 Apr, 2023 09:01 IST|Sakshi

రోషన్‌. జెడ్‌, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్‌ ప్రభన్‌, అనిరుధ్‌.టి, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్‌ సత్తిపండు కీలక పాత్రల్లో నటించిన చిత్రం అరంగేట్రం. శ్రీనివాస్‌ ప్రభన్‌ దర్శకత్వంలో మహేశ్వరి.కె నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుకలో శ్రీనివాస్‌ ప్రభన్‌ మాట్లాడుతూ.. పక్కా కమర్షియల్‌​ మూవీ అరంగేట్రం. సైకో, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో పాటు మంచి ప్రేమకథ ఉంటుంది. ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల మధ్య ప్రధానంగా సాగే సినిమా ఇది అన్నారు. మా అరంగేట్రం చాలా బాగా వచ్చింది అన్నారు మహేశ్వరి. మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా నిర్మించాం అన్నారు సహనిర్మాత విజయలక్ష్మి.

మరిన్ని వార్తలు