ఆ పర్సన్‌తో క్లోజ్‌గా ఉన్నావ్‌.. అది తప్పుకాదా? షణ్ముఖ్‌-దీప్తిల బ్రేకప్‌పై శ్రీరెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

4 Jan, 2022 19:35 IST|Sakshi

యూట్యూబ్‌ స్టార్స్‌ షణ్ముఖ్‌-దీప్తి సునైనాల బ్రేకప్‌ ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్‌ షో కారణంగానే వీళ్లు విడిపోయారా?  షణ్ముఖ్‌ సిరితో క్లోజ్‌గా మూవ్‌ కావడం వల్లే దీప్తి బ్రేకప్‌ చెప్పిందా? ఐదేళ్లుగా కలిసి ఉన్న వీళ్లు ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవడం ఏంటి? అనే నెటిజన్స్‌ చర్చించుకుటున్నారు. తాజాగా వీరి బ్రేకప్‌పై  వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. బిగ్‌బాస్‌ షోలో సిరితో షణ్ముఖ్‌ క్లోజ్‌గా ఉండడం వల్లే బ్రేకప్‌ చెబితే.. మరి అదే షోలో దీప్తి కూడా ఒక పర్సన్‌తో క్లోజ్‌గా ఉంది. నీ వరకు వచ్చేసరికి అది తప్పుకాదా? అని దీప్తిని ప్రశ్నించింది శ్రీరెడ్డి. 

‘షణ్ముఖ్‌-దీప్తిలది చూడచక్కని జంట. అలాంటి వారు బ్రేకప్‌ చెప్పుకోడం అందిరితో పాటు నన్ను కూడా కలచివేసింది. మనం ఎన్ని చేసినా భారతీయులమనేది మరిచిపోవద్దు. జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా మన సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకూడదు. టెక్నాలజీ పరంగా మీరు డెవలప్‌ అవ్వండి. కానీ కొన్ని విషయాల్లో చాలా సెన్సిటీవ్‌ అయిపోతున్నారు.తట్టుకునే గుణం ఈ కాలం పిల్లలకు చాలా తక్కువగా ఉంది. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం.

దీప్తి.. షణ్ముఖ్‌తో ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నావు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని నువ్వే చెప్పావు. బిగ్‌బాస్‌లో జరిగినదానికి షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పావని క్లియర్‌గా అర్ధం అవుతుంది.. మరి నువ్వు బిగ్ బాస్‌కి వెళ్లినప్పుడు ఒక పర్సన్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నావో.. మీ రిలేషన్ షిప్ ఏంటో అందరం చూశాం.. ఇది లవ్ ఏమో అని జనాలకి అనుమానం వచ్చేట్టుగా ప్రవర్తించావు. నీ వరకూ వచ్చేసరికి అది తప్పుగా అనిపించలేదా? 

షణ్ముఖ్‌తో పెళ్లి కాలేదు కాబట్టి.. బ్రేకప్ చెప్పింది. అదే పెళ్లై ఉంటే షణ్ముఖ్‌ని వదిలేసేదా? మనిషి అన్నాక తప్పులు చేస్తుంటారు.. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడు ఒకరి తప్పుల్ని ఒకర్ని క్షమించుకోవాలి. ఓపికతో ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి’అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. అలాగే టాటూల గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లికి ముందు టాటూలు వేయించుకున్న చాలా మంది విడిపోయారు. పెళ్లైన తరువాత వంద వేషాలు వేయండి.. దీప్తి సునయన కూడా టాటూలు వేయించుకుంది.. ఇప్పుడు అది రిమూవ్ చేయించుకోవాలని అనుకుంటుంది. మీపై మీకు నమ్మకం లేకపోతే టాటూలు వేయించుకోకండి’అని శ్రీరెడ్డి తనదైన స్టైల్లో చెప్పేసింది.

మరిన్ని వార్తలు