శ్రీసింహా ‘ 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ రిలీజ్‌

7 Oct, 2022 19:19 IST|Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.  ఇటీవల ‘దొంగలున్నారు జాగ్రత్త’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రీసింహా.. తాజాగా మరో చిత్రం ‘బాగ్‌ సాలే’ ని రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు.  ప్రణీత్‌ సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ  క్రైమ్ కామెడీ చిత్రాన్ని  వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ.. ‘ఈతరం ప్రేక్షకులని అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న చిత్రం 'భాగ్ సాలే'.  ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్ చేస్తుంది’ అన్నారు. ఈ చిత్రంలో నేహా సొలంకి హీరోయిన్ గా నటించగా,  జాన్ విజయ్, నందిని రాయ్ ప్రతినాయక పాత్రలు పోషించారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

మరిన్ని వార్తలు