స్నేహితుడిని కాపాడమంటూ సంగీత దర్శకుడి అభ్యర్థన

7 Jun, 2021 10:03 IST|Sakshi

టాలీవుడ్‌ సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన స్నేహితుడిని కాపాడమంటూ సినీప్రముఖులను అభ్యర్థిస్తున్నాడు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశాడు. 'ఫొటోగ్రాఫర్‌గా ఎదుగుతున్న నా స్నేహితుడు జీవన్‌ కిశోర్‌ వర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని రక్షించేందుకు సాయం చేయండి. నేను నా వంతు సాయం అందించాను. దయచేసి మీరు కూడా మీ వంతు కృషి చేయండి' అంటూ తన స్నేహితులు సత్యదేవ్‌, అడివి శేష్‌, కోనవెంకట్‌ను వేడుకున్నాడు.

దీనిపై సత్యదేవ్‌ స్పందిస్తూ తన వంతు సాయం చేశాను అని రిప్లై ఇచ్చాడు. కాగా జీవన్‌ వైద్యానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా వారికి తోచిన సాయం అందిస్తున్నారు. కాగా శ్రీచరణ్‌ పాకాల 'కిస్‌' సినిమాతో తన కెరీర్‌ను ఆరంభించినప్పటికీ 'క్షణం' చిత్రంతో పేరు సంపాదించుకున్నాడు. 'పీఎస్‌వీ గరుడ వేగ', 'గూఢచారి', 'అశ్వత్థామ', 'నాంది' చిత్రాలు అతడికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం అతడు 'మేజర్‌'తో పాటు 'తిమ్మరుసు' సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ అంజలి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు