మన జీవితాల్లోనివే ఈ సినిమాలో ఉన్నాయి – సుష్మిత కొణిదెల

16 Feb, 2023 01:50 IST|Sakshi

‘‘మన జీవితంలో మనం అనుభవించే నిజమైన భావోద్వేగాలు, లవ్, ఫెంటాస్టిక్‌ డ్రామా ‘శ్రీదేవి శోభన్‌బాబు’లో ఉంటాయి. ప్రశాంత్‌తో పాటు యూనిట్‌ అంతా ఈ సినిమాకి మనసు పెట్టి పని చేశారు’’ అని సుస్మిత కొణిదెల అన్నారు. సంతోష్‌ శోభన్, గౌరి జి. కిషన్‌ జంటగా ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ వేడుకలో సుస్మిత మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి (చిరంజీవి) ఆశీస్సులతో మా ‘శ్రీదేవి శోభన్‌బాబు’ని మీ ‘శ్రీదేవి శోభన్‌బాబు’గా థియేటర్స్‌కి తెస్తున్నాం’’ అన్నారు. ‘‘చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఓ కాఫీ షాప్‌లో సుష్మిత అక్కని కలిసి, ‘నేను చిరంజీవి సార్‌ అభిమానిని.. డైరెక్టర్‌ అవుదామని ప్రయతి్నస్తున్నాను’ అన్నాను.

అలా చెప్పిన ఐదు రోజులకే అక్క నుంచి కాల్‌ వచ్చింది.. నాన్న (చిరంజీవి) కథ వింటానన్నారు.. ఇంటికి రమ్మన్నారని అక్క అన్నారు. అక్కడికి వెళ్లగానే చిరంజీవిగారు సొంత మనిలా నన్ను పలకరించారు’’ అన్నారు. ‘‘అచ్చమైన తెలుగు సినిమా ‘శ్రీదేవి శోభన్‌బాబు’’ అన్నారు సంతోష్‌ శోభన్‌. ‘‘మా చిత్రాన్ని అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు విష్ణు ప్రసాద్‌. 

మరిన్ని వార్తలు