శ్రీదేవి సోడా సెంటర్‌: ఇరగదీసిన సుధీర్‌ బాబు

11 May, 2021 10:48 IST|Sakshi

నేడు(మే 11) టాలెంటెడ్‌ హీరో సుధీర్‌బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు సూరిబాబుగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్‌ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో నదిలో ఏదో పడవ పందెం జరుగుతున్నట్లుగా కపిపిస్తోంది. అయితే ఓడలో ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడీ హీరో. పనిలో పనిగా సిక్స్‌ప్యాక్‌ బాడీని కూడా చూపించారు. తిరునాళ్లలో హీరో సిగ్గు, ప్రేమ, ఫైటింగ్‌.. అంతా చూపించారు. కానీ హీరోయిన్‌ను మాత్రం ఎక్కడా ఫ్రేమ్‌లో చూపించనేలేదు.

కాగా ఈ చిత్రానికి ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా వుంటే సమ్మోహనం, వి చిత్రాల తర్వాత సుధీర్‌ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కుతోంది. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను గాజుల పల్లి సుధీర్‌బాబు సమర్పణలో బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’కిశోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు