త్వరలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్‌ ఎంట్రీ!

25 May, 2021 20:54 IST|Sakshi

అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తుంది. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. విదేశాలలో ఇటీవలే చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషీ కపూర్ ఇప్పుడు సినిమాల్లో రాణించాలని భావిస్తోందట. తండ్రి బోనీకపూర్ కూడా ఆమెను  వెండితెరకి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మొదట బాలీవుడ్‌ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని భావించినా తండ్రి బోనీ కపూర్‌ మాత్రం తెలుగు సినిమాతో అరంగేట్రం చేయించాలని చూస్తున్నారట.

ఇందుకోసం ఇప్పటికే ఖుషీ కపూర్‌  యాక్టింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.  త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇంతకుముందే జాన్వీ కపూర్‌ సైతం టాలీవుడ్‌లో నటించనుందనే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్‌- మహేష్‌బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాతో జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇవి కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఇప్పటికే ఆ సినిమాలో పూజా హెగ్డేను ఫైనల్‌ చేశారు. మరో హీరోయిన్‌ ఎవరు అన్న దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

చదవండి : శ్రీదేవి నాకు రోల్‌మోడల్‌ : ప్రియంక చోప్రా
బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు