‘ఏజెంట్‌’ తర్వాత అఖిల్‌ టార్గెట్‌ ఏంటి..?

12 Aug, 2023 05:02 IST|Sakshi

‘ఏజెంట్‌’ తర్వాత అఖిల్‌ కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెల్లడి కాలేదు. అయితే అనిల్‌ అనే ఓ కొత్త దర్శకుడితో అఖిల్‌ సినిమా చేయనున్నారని, ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలతో అఖిల్‌ ఓ సినిమా చేయనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

శ్రీకాంత్‌ ఓ కథను రెడీ చేసి, అఖిల్‌కు వినిపించారట. ఈ స్క్రిప్ట్‌ అఖిల్‌కి నచ్చిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అఖిల్‌ – శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లోని సినిమా ఉంటుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన ‘పెద కాపు 1’ ఈ నెలలోనే విడుదల కానుంది. ఒకవేళ అఖిల్‌తో సినిమా కన్ఫార్మ్‌ అయితే.. ‘పెద కాపు 1’ విడుదల తర్వాత ప్రకటన వస్తుందేమో?

మరిన్ని వార్తలు