Srikanth Iyengar: నా పాత్రకు డబ్బింగ్‌ చెప్తున్నప్పుడు నాకే ఛీ అనిపించింది

22 Nov, 2021 20:20 IST|Sakshi

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 1997. డా.మోహన్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమాలో అవినీతి పోలీస్ అధికారిగా భిన్నమైన పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ తాజా ఇంటర్వ్యూలో సినిమా కబుర్లు చెప్పుకొచ్చాడు.

'నా నలభై ఏడేళ్లకు నాకు బ్రేక్ వచ్చింది. ముఖ్యంగా బ్రోచేవారెవరురా సినిమాతో నాకు సక్సెస్ దక్కింది. ఆ తరువాత పలు సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో చేస్తున్నాను. ఒకసారి నేను షూటింగ్‌ చేస్తున్న సమయంలో మోహన్‌ గారు సెట్స్‌కు వచ్చి కథ చెప్పారు. కథ నచ్చడంతో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాను. అమ్మాయిపై అత్యాచారం చేసి, పెట్రోల్‌ పోసి తగులబెట్టడం వంటి నేరాల నేపథ్యంలో 1997 సినిమా ఉంటుంది. 

నా పాత్రకు డబ్బింగ్‌ చెప్తున్నప్పుడు నాకే ఛీ అనిపించింది. అంత నీచమైన పాత్ర నాది. నా గాడ్ ఫాదర్ వర్మ గారే! . నటుడిగా నేను మూడు పాత్రలు మాత్రం చేయను.. ఆ పాత్రలు తప్ప మిగతా పాత్రలు చేస్తా. ఆ పాత్రలేవంటే .. చైల్డ్ ఆర్టిస్ట్ , హీరోయిన్ , హీరో ఈ మూడు పాత్రలు తప్ప అన్ని రకాల పాత్రలు చేస్తా!' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ‘1997’ అందరూ తప్పక చూడాల్సిన సినిమా: నటుడు ప్రకాష్ రాజ్

మరిన్ని వార్తలు