భయం.. వినోదం

16 Aug, 2020 04:32 IST|Sakshi
శ్రీకాంత్, సందీప్తి

శ్రీకాంత్, సందీప్తి జంటగా అప్పాజీ కొండా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సిరంగి’. పత్రి మాధ్య చార్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పత్రి మాధ్య చార్య క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా అప్పాజీ కొండా మాట్లాడుతూ –‘‘మంచి కథ కుదిరింది. కొత్తవాళ్లతో మంచి ప్రయోగం చేస్తున్నాం. రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభించాం. సెప్టెంబర్‌ 25కి షూటింగ్‌ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘సిరంగి’ కథ చాలా బాగా నచ్చింది. అప్పాజీ కొండా ఈ సినిమాని బాగా చిత్రీకరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు పత్రి మాధ్య చార్య. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.వి. శివా రెడ్డి, సంగీతం: జయ సూర్య.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు