నేరుగా ఓటీటీలోకి శ్రీని ‘ఆన్‌ ఎయిర్‌’

5 May, 2022 17:02 IST|Sakshi

ఓల్డ్ మాంక్ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న హీరో, దర్శకుడు ఎంజీ శ్రీనివాస్‌(శ్రీని) మరో విభిన్న థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'ఆన్ ఎయిర్' అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీని ఆర్ జే గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై లో ఓటీటీలో విడుదల కానుంది. 'బాహుబలి' 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి పలు భారీ చిత్రాల రైటర్ విజయేంద్ర ప్రసాద్ అసోసియేట్ ప్రశాంత్ సాగర్ 'ఆన్ ఎయిర్' కు దర్శకత్వం వహించారు.

రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాల్లోకి రాకముందు రెడీయో జాకీగా పనిచేసిన శ్రీని.. .ఆన్‌ ఎయిర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఓ ప్రముఖ రెడీయో స్టేషన్‌కు చెందిన ఆర్‌జే  విడుదల చేశారు. ‘ఆన్‌ ఎయిర్‌ కథంతా రేడియో స్టేషన్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రను రాసేటప్పుడు రెడీయో జాకీగా పనిచేసిన అనుభవం బాగా పనిచేసిందని శ్రీని అన్నారు.

మరిన్ని వార్తలు