Kapil Returns Latest Update: దర్శకనిర్మాత, హీరో అన్నీ ఒక్కరే.. కాన్సెప్ట్‌ ఏంటంటే?

25 Sep, 2023 12:08 IST|Sakshi
ఆడియో ఆవిష్కరణలో కపిల్‌ రిటన్స్‌ చిత్ర యూనిట్‌

ధనలక్ష్మి క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనీ సుందరరాజన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం కపిల్‌ రిటన్స్‌. నటి నిమిషా రియాజ్‌ ఖాన్‌, పరుత్తివీరన్‌ సరవణన్‌, వయాపురి మాస్టర్‌ భరత్‌, మాస్టర్‌ జాన్‌, బేబీ షర్షా ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు.

ఇందులో ప్రముఖ రచయిత శుభ పాండియన్‌, దర్శకుడు ఆర్వీ. ఉదయ్‌ కుమార్‌, పేరరసు, గీత రచయిత స్నేహన్‌, నిర్మాత ఎన్‌. విజయ మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు శ్రీనీ సుందర రాజన్‌ మాట్లాడుతూ ఇది ‘మీ కలలు నెరవేరాలంటే శ్వాస ఉన్నంతవరకు ప్రయత్నించు’ అనే ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాలను అలరించే విధంగా చిత్రంలోని కథా సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు.

దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఇది విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్య అవగాహనతో కూడిన అనుబంధాన్ని ఆవిష్కరించే కథాచిత్రంగా దీన్ని తెరకెక్కించారన్నారు. ఇది తల్లిదండ్రులు పిల్లలు కలిసి చూడాల్సిన ఓ అద్భుతమైన చిత్రమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడికి అభినందనలు తెలిపారు.

చదవండి: నా జీవితంలో ఆ ముగ్గుర్నీ ఎప్పుడూ మర్చిపోను

మరిన్ని వార్తలు