ప్రభాస్‌తో 'కేజీఎఫ్'‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి స్టెప్పులు‌

17 Mar, 2021 07:55 IST|Sakshi

ఎంత పెద్ద ‘బాహుబలి’లాంటి సినిమా అయినా మనోహరమైన స్పెషల్‌ సాంగ్‌ ఉంటే ఓ కనువిందు. ఆ సినిమాలో ప్రభాస్‌తో ఇద్దరు భామలు కలసి స్టెప్పేసిన ‘మనోహరా..’ పాట ఐటమ్‌ సాంగ్‌ ప్రియులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ప్రభాస్‌ నటిస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘సలార్‌’లోనూ ఓ ప్రత్యేక పాట ఉందని సమాచారం. అయితే ఇందులో ఇద్దరు కాకుండా ప్రభాస్‌తో ఒకే ఒక్క బ్యూటీ కాలు కదుపుతారట.

ఆ బ్యూటీ ఎవరంటే ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధీ శెట్టి అని సమాచారం. ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోనే ‘సలార్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనిధి డ్యాన్సింగ్‌ స్కిల్‌ గురించి ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి ‘సలార్‌’లో ప్రత్యేక పాటకు తీసుకోవాలనుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ ప్రత్యేక పాట వార్త నిజమేనా? చూడాలి. 

చదవండి: పది చదవని హీరో కమల్‌హాసన్‌ ఆస్తులు ఎంతో తెలుసా..?

మహేశ్‌బాబుకు జోడీగా శ్రీదేవి కూతురు‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు