‘ముగ్గురు మొనగాళ్లు’..రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

24 Jul, 2021 21:19 IST|Sakshi

కమెడియన్‌  శ్రీనివాస్‌ రెడ్డి మరోసారి హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగానూ నటించిన ఆయన ఇప్పుడు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో మరోసారి హీరోగా సందడి చేయనున్నారు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు నిర్మించారు. ఇందులో శ్రీనివాస్‌ రెడ్డి మెయిన్ లీడ్‌ రోల్‌ చేస్తుండగా, దీక్షిత్‌ శెట్టి,  వెన్నెల రామారావు ప్రధాన పాత్రలు పోషించారు.

ముగ్గురు దివ్యాంగుల జీవితంలో చోటుచేసుకునే క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అనుకోని విధంగా ఓ హత్యకేసు నుంచి చిక్కుకున్న ఆ ముగ్గురు ఎలా అక్కడినుంచి బయటపడ్డారు అన్న అంశాలతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్‌ అభిలాష్‌ తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు6న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించారు. 

మరిన్ని వార్తలు