Rajamouli Made In India Movie: కథ వినగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యా: రాజమౌళి

19 Sep, 2023 11:58 IST|Sakshi

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మరో సినిమాను ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్‌ సినిమాతో తెలుగుస్థాయిని ప్రపంచానికి చాటిచెప్పన దర్శకధీరుడు తాజాగా చేసిన ట్వీట్‌ తెగ వైరలవుతోంది. భారతీయ సినిమా రంగంపై వస్తున్న బయోపిక్‌ను సమర్పించనున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.  గత రెండు రోజులుగా రాజమౌళి నుంచి ఓ భారీ ప్రకటన  చేయనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందరూ  ఊహించినట్లుగానే ఓ భారీ సినిమాను ప్రజెంట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

భారతీయ సినిమా చరిత్రను తెలియజేస్తూ మేడ్ ఇన్ ఇండియా అనే చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా.. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు రాజమౌళి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

రాజమౌళి ట్వీట్‌లో రాస్తూ.. 'నేను మొదట కథనం విన్నప్పుడు.. అది భావోద్వేగంగా నన్ను కదిలించింది. బయోపిక్‌ని రూపొందించడం చాలా కష్టం. కానీ భారతీయ సినిమా పితామహుడు గురించి ఆలోచించడం మరింత సవాలుతో కూడుకున్నది. మా అబ్బాయిలు అందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది.' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ మూవీని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించనున్నారు. 

ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్ సినిమా అంటే మనకు గుర్తొచ్చే పేరు దాదాసాహెబ్ ఫాల్కే. అతనిని భారత సినిమా పితామహుడు అని పిలుస్తారు. 1913లో విడుదలైన రాజా హరిశ్చంద్ర ఆయన నిర్మించిన తొలి ఇండియన్ సినిమా. ఆయన బయోపిక్‌ను సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి తన నెక్ట్స్‌ మూవీ మహేశ్‌ బాబుతో చేయనున్నారు. యాక్షన్‌ అడ్వంచర్‌గా రూపొందించనున్నట్లు తెలిసిందే. కానీ అందరూ ఈ సినిమా గురించే ప్రకటన చేస్తారని అనుకున్నారు. 

మరిన్ని వార్తలు