SS Rajamouli-Hrithik Roshan: ‘నేను అలా అనకూడదు.. కానీ హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు’

15 Jan, 2023 16:49 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సృష్టించిన సంచలనం అంతఇంతా కాదు. రీసెంట్‌ ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ, డైరెక్టర్‌ రాజమౌళి, ఎమ్‌ఎమ్‌ కీరవాణిల పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్నాయి. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ నామినేషన్‌లో నిలవడంతో జక్కన్న కొద్ది రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మీడియాతో ముచ్చటించిన ఆయన గతంలో బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా హృతిక్‌ను కించపరస్తూ చేసిన కామెంట్స్‌పై ఆయనకు ప్రశ్న ఎదురైంది.

చదవండి: ఆస్కార్ రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతలుండాలి..?

దీనికి రాజమౌళి స్పందిస్తూ.. ‘‘ఇది జరిగి చాలా కాలం అవుతుంది. దాదాపు 15-16 ఏళ్లు గడిచింది. అప్పుడు నేను చేసిన కామెంట్స్‌ ఇప్పుడేందుకు బయటకు వచ్చాయో తెలియదు. అది బిల్లా మూవీ ప్రమోషన్స్‌ కార్యక్రమంలో అన్నాను. ఆ ఈవెంట్‌కు నేను గెస్ట్‌గా వెళ్లాను. ‘ప్రభాస్‌ ముందు హృతిక్‌ రోషన్‌ నథింగ్‌’ అన్నాను. అలా అనడం కరెక్ట్‌ కాదు. నేను మాట్లాడిన పదాల ఎంపిక బాగాలేదు. కానీ హృతిక్‌ రోషన్‌ కించపరచడం నా ఉద్దేశం కాదు. అతను అంటే నాకు చాలా గౌరవిస్తాను’’ అంటూ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసి చాలా మంది ఆయనను పొగడ్తలతో ముంచెత్తున్నారు.

చదవండి: ఈ సంక్రాంతి మాకు కొత్త ఆరంభం: ఉపాసన స్పెషల్‌ పోస్ట్‌

‘తప్పును అంగీకరించడం మీ గొప్పతనం’, మరోసారి మీ వినయాన్ని చూపారు’ అంటూ నెటిజన్లు జక్కన్నపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా అప్పుడు బిల్లా మూవీ ఈవెంట్‌లో జక్కన్న మాట్లాడుతూ.. ‘ధూమ్‌ 2 మూవీ చూసి.. ఎందుకు బాలీవుడ్‌యే ఇలాంటి క్వాలిటి మూవీస్‌ తీస్తుందని ఆశ్చర్యపోయాను. ఎందుకు హృతిక్‌ రోషన్‌ లాంటి హీరోలు మనకు లేరా? అనుకున్నా. కానీ బిల్లా ట్రైలర్‌, పోస్టర్స్‌, పాటలు చూశాక ప్రభాస్‌ ముందు హృతిక్‌ రోషర్‌ నంథింగ్‌ అనిపించింది. హాలీవుడ్‌ రేంజ్‌లో బిల్లా మూవీ తీసిన డైరెక్టర్‌ మెహర్ రమేశ్‌కు ధన్యవాదాలు’ అని రాజమౌళి వ్యాఖ్యానించాడు. ఇప్పుడ అవే కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు