ఆ జానర్‌లో ఉన్న ఒకే ఒక్క తెలుగు హీరో శ్రీ విష్ణు – రాజమౌళి 

4 May, 2022 00:24 IST|Sakshi
చైతన్య దంతులూరి, కేథరిన్, శ్రీ విష్ణు, సాయి కొర్రపాటి, రాజమౌళి, శేఖర్‌ కమ్ముల

‘‘పక్కింటి కుర్రాడిలా ఉంటాడు శ్రీ విష్ణు. ఒక చేప నీటిలోకి ఎంత ఈజీగా వెళ్లగలదో శ్రీ విష్ణు ఓ మాస్‌ హీరో పాత్రలోకి అలా వెళ్లగలడు. అంత ఈజీగా మాస్‌ క్యారెక్టర్‌లోకి షిఫ్ట్‌ అవ్వగలడని మనం ఊహించలేం. ఇంతకుముందు కూడా శ్రీ విష్ణు మాస్‌ పాత్రలు చేశాడు. కానీ ‘భళా తందనాన’ స్టార్టింగ్‌లో మామూలుగా కనిపించి ఆ తర్వాత చాలా ఈజీగా మాస్‌ హీరోలా ట్రాన్స్‌ఫార్మ్‌ అవుతాడు. ఆ కైండ్‌ ఆఫ్‌ జానర్‌లో తెలుగులో ఉన్న ఒకే ఒక్క హీరో శ్రీ విష్ణు’’ అన్నారు దర్శకుడు రాజమౌళి.

శ్రీ విష్ణు, కేథరిన్‌ హీరో హీరోయిన్లుగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భళా తందనాన’. సాయికొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అతిథులుగా పాల్గొన్న దర్శకులు రాజమౌళి, శేఖర్‌ కమ్ముల బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేశారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఎంచుకుంటున్న సబ్జెక్ట్స్‌ నుంచే తనకంటూ డిఫరెంట్‌ జానర్‌ను క్రియేట్‌ చేసుకున్న శ్రీ విష్ణుకు మంచి భవిష్యత్‌ ఉంది. ఎవరైనా చిన్న సినిమాను చిన్న సినిమాగా, పెద్ద సినిమాను పెద్దగా తీస్తారు. కానీ చైతన్య దంతులూరి చిన్న సినిమా చేసినా సరే, పెద్ద సినిమా చేస్తున్నాననే యాటిట్యూడ్‌ తన సినిమాలో కనిపించేలా చేస్తాడు. ‘బాణం’ చూసినప్పుడు నాకు ఇలా అనిపించింది.

‘భళా తందనాన’ చూశాను. సేమ్‌ యాటిట్యూడ్‌. నెక్ట్స్‌ ఏం జరుగుతుంది? అనే ఓ టెన్షన్‌ను మెయిన్‌టైన్‌ చేస్తూ.. సస్పెన్స్‌ రివీల్‌ అయినప్పుడు ఓ హై వచ్చేలా చైతన్య చేసుకుంటూ వెళ్లాడు. ఈ సినిమా పట్ల సాయిగారు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఓటీటీలో మంచి ఆఫర్‌ ఉన్నా థియేటర్స్‌లోనే రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని అన్నారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ– ‘‘చైతన్య తీసిన ‘బాణం’ నాకు ఇష్టమైన సినిమా. కంటెంట్‌కు, క్రాఫ్ట్స్‌కు మంచి వేల్యూ ఇచ్చే వ్యక్తి చైతన్య అని ‘బాణం’ తర్వాత అనుకున్నాను. ‘భళా తందనాన’ ట్రైలర్‌ బాగుంది. సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. శ్రీ విష్ణు నా దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో స్మాల్‌ రోల్‌ చేశాడు. అప్పటిలానే అదే వినయంతో ఉన్నాడు. సాయి కొర్రపాటిగారు ఇలాంటి మరిన్ని మంచి చిన్న సినిమాలు నిర్మించాలి’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా అద్భుతంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా బయటకు తీసుకువచ్చిన రాజమౌళిగారికి థ్యాంక్స్‌.

ఇందువల్ల తెలుగు సినిమాలే కాదు.. మా విలువ కూడా పెరిగింది సార్‌ (రాజమౌళిని ఉద్దేశించి..). శేఖర్‌ కమ్ములగారితో నాకు వర్క్‌ చేసిన అనుభవం ఉంది. నాలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని ఎంతోమంది కొత్తవారు ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా సెటిలయ్యారు. సాయిగారిలాంటి డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ను నేనింతవరకు చూడలేదు. మణిశర్మగారు తన ఆర్‌ఆర్‌తో సర్‌ప్రైజ్‌ చేస్తారు. చైతన్య, నేను 14 ఏళ్లుగా మంచి స్నేహితులం. మంచి సినిమా చేశాం. 6న వస్తున్నాం.. సిక్స్‌ కొడతాం’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘రాజమౌళిగారి సినిమాల్లోని కమర్షియాలిటీని, శేఖర్‌ కమ్ములగారి సెన్సిబిలిటీని ఒక శాతం అయినా నా సినిమాలో వినియోగించాననే అనుకుంటున్నాను. తన యాక్టింగ్‌తో శ్రీ విష్ణు సర్‌ప్రైజ్‌ చేస్తారు. కథా రచయిత శ్రీకాంత్‌ వల్లే ఈ సినిమా స్టార్ట్‌ అయ్యింది. ఈ సినిమాను ఏ థియేటర్స్‌లో అయినా ఎవరైతే ఫస్ట్‌ చూస్తారో వారికి అంకితం ఇస్తున్నాను. వారే మా టార్చ్‌ బేరర్స్‌’’ అన్నారు చైతన్య దంతులూరి. ఈ కార్యక్రమంలో రాజమౌళి సతీమణి, స్టయిలిస్ట్‌ రమా రాజమౌళి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రియ, రచయిత శ్రీకాంత్‌ విస్సా, నటుడు గరుడ రామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు