మరో ఆస్కార్‌పై రాజమౌళి గురి.. హాలీవుడ్ రేంజ్‌లో భారీ స్కెచ్‌!

17 Mar, 2023 15:17 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి రేంజ్ పెరిగిపోయింది. హాలీవుడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఇప్పటికే రాజమౌళితో సినిమా తీసేందుకు హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సిద్దంగా ఉన్నాడు. హాలీవుడ్ లో సినిమా తీసే ఆలోచన ఉంటే తనని అప్రోచ్ కావాలంటూ రిక్వెస్ట్ కూడా చేశాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ కి ఆస్కార్ వచ్చిన తర్వాత హాలీవుడ్ నిర్మాతలే కాదు...హాలీవుడ్ యాక్టర్స్ రాజమౌళి తో వర్క్ చేసేందుకు రెడీ గా ఉన్నారు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ మూవీ కి సూపర్ స్టార్ మహేశ్‌ బాబుతో ఎప్పుడో కమిట్‌ అయ్యాడు. అంతే కాదు ఈ సినిమా జోనర్ కూడా ఫిక్స్ అయిపోయింది. టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మీడియా ఇంటరాక్షన్ లో జక్కన్న మాట్లాడుతూ.. మహేశ్ తో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చేయనున్నట్లు తెలిపారు. హాలీవుడ్ లో రేంజ్ లో తెరకెక్కించబోయే ఈ సినిమా కోసం రైటర్ విజయేంద్రప్రసాద్ టీమ్ ఈ మూవీ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తోంది. 

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ స్టార్ట్ అయిన ఈ మూవీ ఓపెనింగ్ ఆగస్టులో ఉంటుందట. అప్పటికి మహేశ్‌ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న #ssmb 28మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక రాజమౌళి-మహేష్‌ బాబు  మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జూన్ తర్వాత ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందట. అలాగే ఈసినిమాలో హీరోయిన్ గా ఆస్కార్ వేదిక పై నాటు నాటు పాటని పరిచయం చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. 

ఈ సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్...యాక్టర్ కోసం రాజమౌళి  హాలీవుడ్ లీడింగ్ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ కి ఆస్కార్ వచ్చిన తర్వాత మహేశ్‌ సినిమా విషయంలో రాజమౌళి ఆలోచన  మారిపోయింది. పాన్ వరల్డ్ మూవీగా కాకుండా...హాలీవుడ్ మూవీ గా తెరకెక్కించాలనుకుంటున్నాడు. ఇప్పటికే యాక్షన్‌ సీక్వెన్స్ కోసం ఓ హాలీవుడ్ టీమ్ తో మాట్లాడిన రాజమౌళి...సిజి వర్క్ కోసం కూడా అక్కడి టీమ్ తోనే డిస్కషన్స్ చేస్తున్నాడట. 

మహేశ్‌తో తెరకెక్కించే సినిమా కూడా ఆస్కార్ బరిలో దించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు. ముందుగానే ఈ సినిమా బడ్జెట్ లోనే ఆస్కార్ ప్రమోషన్స్ బడ్జెట్ కూడా కలిపేశాడట. అలాగే ఈ సినిమాలో మహేష్‌ బాబు పక్కన మరో హీరోయిన్ గా హాలీవుడ్ స్టార్‌ యాక్ట్రెస్ ను తీసుకుంటారనే మాట రాజమౌళి టీమ్ నుంచి వినిపిస్తోంది. ఆస్కార్ దక్కించుకున్నఆర్‌ఆర్‌ఆర్‌ లో కూడా హాలీవుడ్ యాక్టర్ ఒలీవియా మోరిస్ ఓ హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ బ్యూటీ తమ అభిమాన హీరోకి జోడిగా నటిస్తుందని తెలియటంతో మహేష్‌ బాబు ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు