SS Rajamouli: రాజమౌళికి అరుదైన గౌరవం, హాలీవుడ్‌ దర్శకులతో కలిసి..

11 Aug, 2022 14:08 IST|Sakshi

Toronto International Film Festival 2022: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. అంత్యంత ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌-2022(టీఫ్‌)లో రాజమౌళి భాగం కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా టీఫ్‌ అధికారికంగా ప్రకటించింది. హాలీవుడ్‌ ప్రముఖలతో కలిసి ఈ ఏడాది టీప్‌ వేడుకలో ఆయన చర్చావేదికలో పాల్గొననున్నారు. సెప్టెంబర్‌ 8 నుంచి 18 వరకు ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కాగా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. 

చదవండి: చిక్కుల్లో స్టార్‌ హీరో దర్శన్‌, ఆడియో క్లిప్‌తో సహా పోలీసులను ఆశ్రయించిన నిర్మాత

 కెనడాలోని టొరంటోలో ఈ ఫిలిం ఫెస్టివల్‌ను ప్రతి ఏడాది అంత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ వేడుకులో పలువురు సినీ టెక్నిషియన్స్‌తో ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్స్‌ చర్చలు జరపనున్నారు. ఇక ఈసారి సెప్టెంబర్‌లో జరిగే ఈ సినీ ఫెస్టివల్‌కు రాజమౌళికి కూడా ఆహ్వానం అందడం విశేషం. హాలీవుడ్‌ అగ్ర దర్శకులతో కలిసి రాజమౌళి కూడా చర్చించనున్నాడు. టొరంటో ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానం అందిన తొలి భారతీయుడిగా జక్కన్న నిలిచారు. అయితే ఈ ఫెస్టివల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ప్రదర్శించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు