రేపే ‘ఛత్రపతి’ రీమేక్‌ స్టార్ట్‌, ముఖ్య అతిథిగా రాజమౌళి

15 Jul, 2021 15:16 IST|Sakshi

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ఛత్రపతి హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. 2005లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా వివి వినాయక్‌ హిందీలో రీమేక్‌ చేస్తున్నాడు.

పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హజరుకానుండటం విశేషం. ఇక త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం శ్రీనివాస్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మరింత ఫిట్‌గా అయ్యాడు. మాస్‌ లుక్‌తో బెల్లంకొండ మరి హిందీ ఆడియన్స్‌ మెప్పిస్తాడో లేదో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు