అలాంటి సినిమాలను ప్రేక్షకులు వదులుకోరు: రాజమౌళి

30 Jun, 2022 07:02 IST|Sakshi
రితేష్‌ రానా, చెర్రీ, రాజమౌళి, రవిశంకర్, లావణ్యా త్రిపాఠి

‘‘ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడంలేదు అంటున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం యూనిట్‌ మనసు పెట్టి కష్టపడి చేసిన ఏ సినిమాని కూడా ప్రేక్షకులు వదులుకోరు.. అలా కష్టపడాలని సూచిస్తున్నాను. ‘హ్యాపీ బర్త్‌ డే’ చిత్రానికి ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నాను’’ అని డైరెక్టర్‌ రాజమౌళి అన్నారు. లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌ డే. ‘మత్తు వదలరా’ ఫేమ్‌ రితేష్‌ రానా దర్శకత్వం వహించారు.

నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా జూలై 8న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని రాజమౌళి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘హ్యాపీ బర్త్‌డే’ ట్రైలర్‌ బ్లాక్‌బస్టర్‌గా ఉంది. కామెడీ, థ్రిల్లర్‌.. రెండింటినీ కలిపి చేయడం కష్టం. కానీ, రితేష్‌ వాటిని బాగా తీశాడని తెలుస్తోంది’’ అన్నారు. ‘‘మత్తు వదలరా’ కంటే ‘హ్యాపీ బర్త్‌డే’లో డబుల్‌ ఫన్, డబుల్‌ యాక్షన్, డబుల్‌ థ్రిల్‌ ఉంటుంది’’ అన్నారు రితేష్‌ రానా. ‘‘ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. ‘‘జాతి రత్నాలు’ని కుటుంబంతో కలిసి ఎలా ఎంజాయ్‌ చేశారో మా ‘హ్యాపీ బర్త్‌డే’ని కూడా అలాగే ఆస్వాదిస్తారు’’ అన్నారు వై. రవిశంకర్‌.  

మరిన్ని వార్తలు