SS Rajamouli : 'ఈ అవార్డు ఎప్పుడో రావాల్సింది, ఆలస్యమయ్యింది'.. రాజమౌళి ఎమోషనల్‌ పోస్ట్‌

26 Jan, 2023 09:38 IST|Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ వరించింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన స్వరాలు సమకూర్చారు. తన వినసొంపైన బాణీలతో దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. కెరీర్లో ఎన్నో వందల పాటలకు మ్యూజిక్‌ కంపోజ్ చేశారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో మాత్రం కీరవాణి పేరు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది.

ఆయన  కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం కూడా రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కీరవాణికి పద్మశ్రీ రావడంపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించారు. ''నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది.. చాలా ఆలస్యమయ్యింది.

కానీ కానీ మీరు ఎప్పుడూ చెబుతారు కదా.. మన కష్టానికి తగిన ప్రతిఫలం ఊహించని విధంగా అందుతుందని. ఒకవేళ నేనే కనుక ఈ విశ్వంతో మాట్లడగలిగితే.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకోటి ఇవ్వమని చెబుతాను''అంటూ జక్కన్న భావేద్వేగ పోస్ట్‌ చేశారు. దీనికి కీరవాణి వయొలిన్ వాయిస్తుండగా.. తాను కింద కూర్చున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. నా పెద్దన్న.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, గర్వంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. 
 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

మరిన్ని వార్తలు