ఆదిపురుష్‌.. జక్కన్న రియాక్షన్‌

25 Aug, 2020 12:07 IST|Sakshi

‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  ప్రస్తుతం ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తన 21వ చిత్రం చేసేందుకు అంగీకరించారు ప్రభాస్‌. ఇది ఇలా ఉండగానే ఆకస్మాత్తుగా 22వ చిత్రం ‘ఆదిపురుష్‌’ని ప్రకటించారు డార్లింగ్‌. ఈ చిత్రానికి ‘తానాజీ’ ఫేమ్‌ ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహించనున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదలయిన మోషన్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. (మరో మేకోవర్‌)

ఇక ‘బాహుబలి’తో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ఈ సినిమాపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ గురించి నాకు ముందే తెలుసు. పోస్టర్‌ను నేను అందరి కంటే ముందు చూశాను. అద్బుతంగా ఉంది. రాముడి పాత్రకు ప్రభాస్‌ సరిగ్గా సెట్‌ అవుతాడు. ప్రస్తుతం అయోధ్యలో మందిరం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ సినిమాను రూపొందించాలనే నిర్ణయం నిజంగా అభినందనీయం. దేశమంతటా రాముడి గురించి చర్చ జరుగుతున్న సమయంలో రాముడిపై సినిమా వస్తే మరింత బాగుంటుంది. ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచుతుంది. ఈ సినిమా కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. ఒక విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నాను’ అన్నారు జక్కన్న
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా