మహేశ్‌- రాజమౌళి మూవీ: జక్కన్న భారీ స్కెచ్‌.. హీరోయిన్‌ ఆమేనా?

17 Sep, 2022 10:59 IST|Sakshi

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. పనిలో పనిగా నటీనటుల ఎంపికపై కూడా రాజమౌళి దృష్టి సారించారు. ప్రస్తుతం హీరోయిన్‌ను ఎంచుకునే పనిలో ఉన్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారంటూ ప్రముఖంగా ఆలియా భట్, దీపికా పదుకోన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి.

(చదవండి: విజయ్‌దేవరకొండపై కృతిశెట్టి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌)

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియా భట్‌ నటించిన విషయం తెలిసిందే. మరోసారి రాజమౌళి చాన్స్‌ ఇస్తే ఆలియా కాదంటారా? అయితే ఇప్పుడు ఆలియా గర్భవతి. కొత్త సినిమాలు కమిట్‌ కావడంలేదు. కానీ మహేశ్‌–రాజమౌళి సినిమా వచ్చే ఏడాది ఆరంభం అవుతుంది. సో.. రాజమౌళి ఆఫర్‌ ఇస్తే ఆలియా నటించే అవకాశం ఉంది. ఆ సంగతలా ఉంచితే.. ఇది ఇంటర్‌నేషనల్‌ ప్రాజెక్ట్‌ కాబట్టి ఇప్పటికే హాలీవుడ్‌ చిత్రాలు చేసిన దీపికా పదుకోన్‌ అయితే బాగుంటుందని కూడా అనుకుంటున్నారట. మరి.. మహేశ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించే చాన్స్‌ ఆలియాకు దక్కుతుందా? లేక దీపికకా.. లేకపోతే ఇద్దరికీ రాజమౌళి చోటు ఇస్తారా? ఈ ఇద్దరూ కాకుండా వేరే తార తెర మీదకు వస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాలంటే వెయిట్‌ చేయక తప్పదు. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు