మ్యారేజ్‌ అంటే ట్రస్ట్‌: కార్తికేయ

15 Oct, 2021 13:22 IST|Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ, తన స్నేహితురాలు, సింగర్‌, జగపతి బాబు బంధువైన పూజను ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్‌ 28 జైపూర్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవం జరిగింది. వారి వివాహం జరిగి రెండేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా ఈ జంట సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారి ప్రేమ, పెళ్లి పరిచయం గురించి ఏం చెప్పారో వారి మాటల్లోనే విందాం రండి. 

కార్తికేయ మాట్లాడుతూ.. ఏడాది ఫ్రెండ్‌షిప్‌ తర్వాత పూజకు ప్రపోజ్‌ చేశా. కొన్ని నెలల తర్వాత ఓకే చేసింది. ఆమె పాట నాకు ఇష్టం.. కావాలన్నప్పుడల్లా నా కోసం పాడతుంది. 
⇔ కాలేజ్‌ డేస్‌లో సొంత జీతం అనే కిక్‌ని ఎంజాయ్‌ చేయడం కోసం ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో పని చేశాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ప్రొడక్షన్‌ వర్క్‌ చూశా. ఇప్పుడు మార్కెటింగ్‌ చూస్తున్నాను. 
⇔ నేను వింటర్‌ వెడ్డింగ్‌ కావాలనుకున్నాను. నాకు చలి ఇష్టం.. తనకు (పూజకి) కష్టం. జైపూర్‌ ప్యాలెస్‌లో డిసెంబరు 28 మా పెళ్లి ముహూర్తం రావడం లక్కీ. 15 ఏళ్లలో కోల్డెస్ట్‌ 10 డిగ్రీల చలిలో మా పెళ్లయింది. మ్యారేజ్‌ అంటే... సెక్యూరిటీ, అండర్‌స్టాండింగ్, ట్రస్ట్, లవ్‌. 
⇔ చాలామంది నమ్మరు కానీ బాబా (రాజమౌళి).. టీ, కాఫీ పాలు సహా ఏమీ తాగరు. పెరుగన్నంలో మాత్రం తప్పకుండా స్వీట్‌ ఉండాల్సిందే. పెరుగు వేసుకుంటుండగానే స్వీట్‌ ఏది అని అడుగుతారు రాజమౌళి. రోడ్‌ ఎంత ఖాళీగా ఉన్నా చాలా స్లోగా డ్రైవ్‌ చేస్తారు.

సినిమా వాళ్లతో పెళ్లొద్దనుకున్నా!: పూజ
⇔ చిన్నప్పటి నుంచీ సినిమా ఫీల్డ్‌ వాళ్లని పెళ్లి చేసుకోవద్దనుకున్నాను. అందుకే కార్తికేయ అడగ్గానే, ఆలోచించా. ఆ తర్వాత ఒప్పుకున్నా. తను ప్రతి విషయంలో నా వైపే ఉంటాడు. హైపర్‌ యాక్టివ్, ఓర్పుకి కేరాఫ్‌.. ప్రేమించిన వారి కోసం ఏమైనా సరే చేస్తాడు. 
⇔ సంప్రదాయ సంగీతం నేర్చుకున్నాను. ప్రాక్టీస్‌ తప్పింది కాబట్టి మళ్లీ సాధన పెంచుకుని సినిమాలకి పాడతానేమో తెలియదు. కానీ నటించడం అంటే కష్టమే... కెమెరా ముందు నెర్వస్‌ అయిపోతా. మీకీ ఇంటర్వ్యూ ఇవ్వడానికే కష్టమైంది. 
⇔ పెళ్లికి ముంతు.. తర్వాత కూడా చుట్టూ ఉన్న శక్తివంత మైన మహిళల నుంచి చాలా నేర్చుకుంటున్నాను. అమ్మ దగ్గర క్రమశిక్షణ, హార్డ్‌ వర్క్‌.. ఎవరిపైనా ఏ నెగటివ్‌ ఫీల్‌ ఉంచుకోకపోవడం అత్తయ్య (రమా రాజమౌళి) దగ్గర, పిల్లల్ని చూసుకోవడం ఎలా అనేది వల్లీ పిన్ని దగ్గర... ఇలా... 


⇔ మా పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా రాజమౌళిగారు అలానే ఉన్నారు. పదేళ్ల తర్వాత కూడా ఆయనలో మార్పు చూడలేనేమో... 
⇔ జగపతి బాబాయ్‌కి చిన్నప్పటి నుంచీ నన్ను అమ్మ దగ్గర నుంచి సేవ్‌ చేయడమే పని.. 
⇔ ట్యాంగిల్‌ ఆర్ట్‌ అనే ఆర్ట్‌ ఫార్మ్‌ ఉంది. ఆర్డర్స్‌ మీద డ్రాయింగ్స్‌ చేస్తాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నైట్‌ షూట్స్‌ టైమ్‌లో అందరికీ ఐస్‌క్రీమ్స్‌ తెప్పించేదాన్ని. ఆ సినిమాలో నా భాగస్వామ్యం అంతే... (నవ్వుతూ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు