Pushpa Pre Release Event: బన్నీ ఇండస్ట్రీకి దొరికిన ఓ బహుమతి: రాజమౌళి

13 Dec, 2021 10:36 IST|Sakshi

– రాజమౌళి

Rajamouli Speech In Pushpa Pre Release Event: ‘‘నా ఫేవరెట్‌ డైరెక్టర్‌ సుక్కు (దర్శకుడు సుకుమార్‌) ‘పుష్ప’ చిత్రాన్ని అత్యున్నతంగా ప్రెజెంట్‌ చేయడానికి ముంబైలో బిజీగా ఉన్నాడు. నేను, సుక్కు ఒకరికొకరం మెసేజ్‌లు పెట్టుకుంటూ ఉంటాం. రీసెంట్‌గా ‘నాకు టైమ్‌ సరిపోవడంలేదని మెసేజ్‌లు పెడుతున్నాడు’. ‘నువ్వు చేయగలిగినదంతా ఈ సినిమాకు చేసెయ్‌’ అన్నాను. దానికి తగ్గట్లుగానే రాత్రీపగలు వర్క్‌ చేస్తున్నాడు’’ అన్నారు దర్శకుడు రాజమౌళి.

నవీన్, రవి, విజయ్, అల్లు అర్జున్, రష్మికా, రవిశంకర్, అనసూయ, చెర్రీ

అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన చిత్రం ‘పుష్ప’. ముత్తం శెట్టి మీడియా సహనిర్మాత. ‘పుష్ప’ తొలి పార్ట్‌ ‘పుష్ప: ది రైజ్‌’ ఈ నెల 17న విడుదల కానున్న సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పని మీద ముంబై వెళ్లినప్పుడు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అక్కడ ఎవర్ని అడిగినా.. ‘పుష్ప’ అన్నారు. బన్నీ (అల్లు అర్జున్‌).. ఈ సినిమాను ఇంకా ప్రమోట్‌ చేయాలి.

ముంబైలో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో నా స్వార్థం మాత్రమే కాదు. మొత్తం ఇండస్ట్రీ స్వార్థం ఉంది. ఎందుకంటే ‘పుష్ప’ మన తెలుగు సినిమా. ఇది ఎంతదూరం వెళ్లాలో అంత దూరం వెళ్లాలి. బన్నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌. నువ్వు పడే కష్టానికి.. నువ్వు పెట్టే ఎఫర్ట్‌కి... డైరెక్టర్‌పై నీకు ఉన్న నమ్మకానికి హ్యాట్సాఫ్‌. ఇండస్ట్రీకి నువ్వు ఒక గిఫ్ట్‌. నిన్ను చూసి చాలామంది ఇన్‌స్పయిర్‌ అవుతారు’’ అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘సుకుమార్‌.. రెండేళ్లకోసారి జరిగే మహా అద్భుతం. అల్లు అర్జున్‌... చాలా రోజులుగా తాను చూపించాలని తపనపడుతున్న విశ్వరూపం, నా కలల ప్రతిరూపం.. దేవిశ్రీ ప్రసాద్‌.. మూడో దశాబ్దంలో కూడా మన కర్ణభేరిపై కూర్చొని వాయిస్తున్న మధుర మృదంగం. రష్మికా... గీతా ఆర్ట్స్‌లో పుట్టిన ఈ చిన్న సితార ఇప్పుడు మేం గర్వపడేంత ఎత్తుకు ఎదిగిన ఒక ధృవతార. మైత్రీ.. చాలామందికి వీరంటే ఇష్టం. నొప్పించక.. తానొవ్వక పరిగెత్తడం కష్టం... త్వరలో వీరు ప్రధమ స్థానానికి చేరడం స్పష్టం’’ అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కొరటాల శివ మాట్లాడుతూ.. ‘‘పుష్ప’లాంటి ప్రపంచాన్ని సృష్టించి, అందులో ఇలాంటి క్యారెక్టర్స్‌ను ఉంచడం సుకుమార్‌ వల్లే అవుతుంది’’. ఇక ఇప్పుడు నేను మాట్లాడేది సుకుమార్‌ స్పీచ్‌ అనుకోండి. ‘‘మైత్రీ మూవీ మేకర్స్‌ ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌. క్యూబాగారు టఫ్‌ లొకేషన్స్‌లో కూడా మంచి విజువల్స్‌ ఇచ్చారు. సినిమాలో క్యారెక్టర్స్‌ మాత్రమే కనిపిస్తాయి. సినిమా సినిమాకు ఎదుగుతున్న స్టార్‌ బన్నీ. ‘పుష్ప’ పాత్ర కోసం బన్నీలా కష్టపడేవారు ఇంకొకరు ఉండరని నమ్ముతున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు