న్యూస్‌ రీడర్‌గా రమా రాజమౌళి.. వీడియో వైరల్‌

21 Jun, 2021 16:52 IST|Sakshi

అపజయం ఎరుగని డైరెక్టర్లలో రాజమౌళి ముందుంటారు. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాశాయి. వంద శాతం సక్సెస్‌ ఫార్ములాతో దూసుకుపోతూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇక రాజమౌళితో పాటు ఆయన కుటుంబంలో పలువురు ఇండస్ట్రీకి చెందినవారే. కీరవాణి, విజేంద్ర ప్రసాద్‌, కార్తికేయ.. ఇలా పలువురు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి ఆయన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలె ఆమె ఫ్రొఫెషన్‌కు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. రమా రాజమౌళి ఇంతకుముందు న్యూస్‌ రీడర్‌గా పనిచేశారంటూ ఓ వీడియో తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఆమె న్యూస్‌ రీడర్‌గా చేసింది కేవలం సీరియల్‌లో ఓ పాత్ర కోసం మాత్రమే. నిజ జీవితంలో ఆమె న్యూస్‌ రీడర్‌గా పనిచేయలేదు.

గతంలో ఓ ఛానెల్‌లో అమృతం అనే సీరియల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సీరియల్‌ అప్పట్లో సూపర్‌ డూపర్‌ హిట్‌. గుణ్ణం గంగరాజు తెరకెక్కించిన ఈ సీరియల్‌లో రాజమౌళి అన్నయ్య కాంచి కూడా నటించారు. ఆయనతో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఈ సీరియల్ కోసం పని చేశారు. అదే సమయంలో రాజమౌళి భార్య రమా రాజమౌళి ఆ సీరియల్‌లో న్యూస్‌ రీడర్‌గా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

చదవండి : RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చేది ఈ అక్టోబరులోనే!
RRR Movie: ఫైట్‌ సీన్‌కి కన్నీళ్లొస్తాయి! 

మరిన్ని వార్తలు