గొప్ప మనసు చాటుకున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌

5 May, 2021 21:37 IST|Sakshi

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెంబర్‌ వన్‌గా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ఎస్‌ఎస్‌ తమన్‌. ఎడాదికి 10పైగా సినిమాలకు సంగీతం అందిస్తూ ఆయన ఫుల్‌ బిజీ అయిపోతున్నారు. దాదాపు తమన్‌ పని చేసిన సినిమాలన్ని సంగీతం పరంగా సూపర్‌ హిట్‌ అవుతున్నాయి. ప్రతి సినిమాలోని పాటలకు ఆయన  సంగీతంతో ప్రాణం పోస్తున్నారు. అలా టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న తమన్‌ తాజాగా గొప్ప మనసును చాటుకున్నారు. ఓ కీ బోర్టు ప్లేయర్‌ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటానంటూ ముందుకు వచ్చి ఉదారతను చాటుకుని అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే ఇటీవల కరోనాతో పలువురు సినీ ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే.  రెండు రోజుల క్రితం కమల్‌ కూమార్‌ అనే కీ బోర్డ్ ప్లేయర్ కూడా మహమ్మారికి బలైపోయాడు. తమన్‌తో పాటు చాలా మంది సంగీత దర్శకుల దగ్గర కీ బోర్డ్ ప్లేయర్‌గా పని చేసిన కమల్‌కు కొన్ని రోజుల కిందట కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో అతడి ఆరోగ్యం క్షిణించడంతో రెండు రోజుల క్రితం అతడు మృతి చెందాడు. కమల్‌ది పేద కటుంబం కావడంలో ఇప్పటికే అతడి కుటుంబానికి పలువురు ఆర్థిక సాయం అందించారు.

ఈ నేపథ్యంలో తమన్‌ సైతం స్పందిస్తూ అతడి కుటుంబానికి అండగా నిలిచారు. ఆర్థికంగా ఆ కుటుంబాన్ని చూసుకుంటూనే.. కమల్‌ కుమారుడిని చదివించే బాధ్యత కూడా తీసుకున్నారట. ఈ విషయం తెలిసి తమన్ అభిమానులు మురిసిపోతూ ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం నువ్వు దేవుడి అన్నా అంటూ మీమ్స్ కూడా క్రియేట్‌ చేసి షేర్‌ చేస్తున్నారు. అంతేగాక మరికొందరూ ‘మీరునువ్వు తీసుకున్న నిర్ణయానికి మీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడతారన్నా, మీ అమ్మ ఈ విషయం తెలిస్తే మీకు కడుపు నిండా అన్నం పెడుతుందన్నా’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

చదవండి: 
దయచేసి మొక్కుతున్నా.. ఆలోచించండి: ఆర్పీ కంటతడి
క్రిష్‌ తన భార్యతో విడిపోవడానికి ఆ హీరోయినే కారణమట!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు