Mahesh Babu-Trivikram: త్రివిక్రమ్‌, మహేశ్‌ సినిమాలో మరో స్టార్‌ హీరో!

20 May, 2022 08:30 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సర్కారు వారి పాట మూవీతో బిజీగా ఉన్న మహేశ్‌ త్వరలోనే త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్‌  ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది.

ఇక త్వరలోనే ఈమూవీ సెట్స్‌పైకి రానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. ఈ సినిమాలో ఓ తెలుగు స్టార్‌ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడని టాక్‌. ఆయన ఎవరో కాదు నేచురల్‌ స్టార్‌ నాని. ఈ సినిమాలో ఓ కీ రోల్‌ కోసం నానిని సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఈ మూవీ సెట్‌పైకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు