మహేశ్‌ బాబు న్యూలుక్‌ చూశారా? షూటింగ్‌ ప్రారంభం

13 Sep, 2022 08:33 IST|Sakshi

సెట్స్‌లో మహేశ్‌బాబు యాక్షన్‌ ఆరంభమైంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. ముందు యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్‌ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది.

నెక్ట్స్‌ షెడ్యూల్‌లో పూజా హెగ్డే జాయిన్‌ అవుతారట. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇక ‘అతడు (2005)’, ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో దాదాపు పన్నెండేళ్ల తర్వాత రూపొందుతున్న చిత్రం ఇది. 

మరిన్ని వార్తలు