విషమంగా నటుడి ఆరోగ్యం, వెంటిలేటర్‌పైనే చికిత్స

12 Aug, 2022 13:07 IST|Sakshi

జిమ్‌ చేస్తూ ఇటీవల గుండెపోటుకు గురైన హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన మెదడు కూడా దెబ్బతిందని తాజా పరీక్షల్లో తేలినట్లు సన్నిహితుల నుంచి సమాచారం.

చదవండి: రిషబ్‌పై ఊర్వశి రీకౌంటర్‌, ‘కౌగర్‌ హంటర్‌’ అంటూ ఘాటు వ్యాఖ్యలు

ఇప్పటికీ ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్‌ చేస్తుండగా శ్రీవాస్తవ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన జిమ్‌ ట్రెయినర్‌ వెంటనే శ్రీవాస్తవను ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు