'డీజే టిల్లు' సీక్వెల్‌ రాబోతుంది.. హీరోయిన్‌ ఎవరో తెలుసా?

24 Oct, 2022 15:03 IST|Sakshi

సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ రాబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది.ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో అనుపమ పరమేశ్వరన్‌ సిద్ధుకు జోడీగా నటించనుంది.

ఈ విషయాన్ని మూవీ మేకర్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. మల్లిక్‌ రామ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా డీజే టిల్లు-2 నుంచి స్పెషల్‌ వీడియోను వదిలారు. అందులో టిల్లు మద్యం  మత్తులో ట్రాఫిక్ పోలీస్ తో వాదన పెట్టుకోవడం నవ్వులు పూయించింది. తాను హీరోనని, తన పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకుందాం అనుకుంటే డేట్స్ ఖాళీగా లేవని చెప్పడం అలరించింది. వచ్చే ఏడాది 2023 మార్చిలో ఈ సినిమా సీక్వెల్‌ థియేరట్‌లో సందడి చేయనుంది. 
 

మరిన్ని వార్తలు