వ్యాక్సీన్‌ తీసుకుంటున్న ఈ  స్టార్‌ డైరెక్టర్‌ ఎవరో గుర్తుపట్టారా?

8 Jun, 2021 15:28 IST|Sakshi

పై ఫోటోలో వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న వ్యక్తిని గుర్తు పట్టారా? ముక్కు.. మూతుల్ని చూపిస్తే ఎంతోకొంత గుర్తు పట్టొచ్చు కానీ.. మొత్తం చేతులతో మూసేసి గుర్తు పట్టమంటే ఎలా అని అడుగుతారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి ఒక క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. ఆయనో పెద్ద దర్శకుడు. ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ప్రభాస్‌, ఎన్టీఆర్‌లతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్లూతో అయినా అతన్ని గుర్తించారా?గుర్తించటం కష్టంగా ఉందా..? ఓకే.. విషయం మేమే చెప్పేస్తాం.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి అంతానికి టీకానే విరుగుడు కావడంతో చాలా మంది వ్యాక్సీన్‌ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు టీకా వేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ కూడా కరోనా టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘మొత్తానికి నేను కరోనా వ్యాక్సీన్‌ తీసుకున్నాను. మీరు కూడా స్లాట్‌ బుక్‌ చేసుకొని మీ ఫ్యామిలీతో సహా వ్యాక్సీన్‌ తీసుకోండి’అని విజ్ఞప్తి చేశారు. 

చదవండి:
‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్ మీనాక్షి ఇలా అయిపోయిందేంటి..? 
Dimple Kapadia: భర్తతో విడిపోయినా, విడాకులివ్వలేదు, ఎందుకంటే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు