స్టార్ మా ‘డాన్స్ ప్లస్’ విజేత ఎవరో తెలుసా ?

23 May, 2021 09:49 IST|Sakshi

స్టార్ మా లో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ‘డాన్స్ ప్లస్’ సంగ్రామం గ్రాండ్ ఫైనల్స్ అద్భుతంగా అలరించబోతున్నాయి. 21 వారాలపాటు ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రేక్షకులకు ఓ సరికొత్త డాన్స్ ప్రపంచాన్ని సృష్టించి, ఉర్రూతలూగించిన సెన్సేషనల్ షో ‘డాన్స్ ప్లస్’ విజేత ఎవరో తేల్చడానికి స్టార్ మా సర్వం సిద్ధం చేసింది.

కొత్త టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన ‘డాన్స్ ప్లస్’.. టైటిల్ ఎవరు గెలుస్తారా అన్న ప్రేక్షకుల ఎదురుచూపుకు ముగింపు పలుకుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన 5,344 డిజిటల్ ఎంట్రీల నుంచి ఆడిషన్స్ నిర్వహించి 18 టీమ్స్ తో మొదలైన ఈ రసవత్తరమైన పోటీ దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి ప్రతిభ గల డాన్సర్లకు ఓ మంచి మంచి వేదిక కల్పించింది. పాన్ ఇండియా డాన్స్ షో గా ప్రేక్షకుల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని అందుకుంది.

ఫైనల్స్ కి అర్హత సంపాదించిన 5 టీం లలో విజేతను తేల్చే ఫైనల్స్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక పండగలా జరిగాయి. తను ఎక్కడున్నా ఎంతో సందడి చేసే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఇక ప్రతి టీం ని సపోర్ట్ చేసేందుకు బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన, స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ "జానకి కలగనలేదు" హీరో అమరదీప్, "జాతిరత్నాలు" సినిమా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా, ప్రముఖ నాట్యకారిణి సంధ్య రాజు, సినిమా సెలబ్రిటీ నటాషా దోషి ఫైనల్స్ ని పోటీ లా కాకుండా ఒక  సంబరంలా మార్చేశారు.

ఎంత పండగలా అనిపించినా పోటీని ఎదుర్కొనే ప్రతి కంటెస్టెంట్... తమ టాలెంట్ తో ఈ షోకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. తనదైన శైలిలో ప్రతి ఎపిసోడ్ నీ ఇంటరెస్టింగ్ గా నడిపించిన దర్శకుడు ఓంకార్ ఫైనల్స్ ని మరింత పదునైన వ్యూహాలతో రసవత్తరంగా నడిపించారు.

రఘు మాస్టర్, యష్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, ముమైత్ ఖాన్, యాని మాస్టర్, మోనాల్ గజ్జర్ న్యాయ నిర్ణేతలుగా వున్న ఈ వేదిక టైటిల్ ని, 20 లక్షల రూపాయల నగదు బహుమతిని ఎవరికి అందచేసింది? ఎవరి హంగామా ఏమిటి? ఎవరు ఏయే పాటలకు ఎలాంటి కొత్త కొత్త స్టెప్స్ వేశారు? టీమ్స్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సెలెబ్రిటీల హడావిడి ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే స్టార్ మా లో "డాన్స్ ప్లస్" ఫైనల్స్ తప్పక చూడాలి. గుర్తుంచుకోండి... ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి "డాన్స్ ప్లస్" గ్రాండ్ ఫినాలే మీకు పరిపూర్ణమైన వినోదాన్ని అందించబోతోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు