కన్నులపండువగా స్టార్‌ మా సండే

27 Feb, 2021 13:01 IST|Sakshi

మిగతా రోజుల కంటే ఆదివారం నాడు కాస్త ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలనిపిస్తుంది. ఎందుకంటే  రోజూ కంటే ఇంట్లో గడిపే సమయం ఎక్కువ ఉంటుంది గనక, ఆదివారం 'ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడం కోసం, ఆదివారాన్ని మెమరబుల్‌ డే ని చెయ్యడం కోసం స్టార్‌ మా గ్రాండ్‌ ఈవెంట్‌ “100% లవ్‌” రెండో భాగంతో వస్తోంది.
 
ఫిబ్రవరి 28న సా. 6 గం.లకు స్టార్‌ మా లో ప్రసారం కాబోతున్న ఈ ఈవెంట్‌లో తెరపైన జంటలు, అసలైన జంటలు మరింతగా కనువిందు చేయబోతున్నారు. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌ అనడానికి అవసరమైన అన్ని అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఈవెంట్‌లో స్టార్‌ యాంకర్‌ ఓంకార్‌ పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. సై అంటే సై అంటున్న రెండు వర్గాల్లో కప్‌ని ఎవరు కొట్టబోతున్నారనెది ఉత్మంఠభరితంగా ఉండబోతోంది.
 
ఇక మధ్యాహ్నం 12 గంటలకు సుమ తన “స్టార్‌ మ్యూజికొతో మేజిక్‌, 1.30 గం.లకు కామెడీని పండించే రైతుల్లాంటి కామెడీ స్టార్స్‌ ఎలాగూ ప్రతి ఆదివారం టోటల్‌ ఫ్యామిలీ ప్యాక్‌ ఎంటర్స్‌టైన్‌మెంట్‌ని ఇస్తూనే ఉన్నాయి. ఈ ఆదివారం స్టార్‌ మాలో ఓహో అనిపించే వినోదం ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉంటుంది. ఆస్వాదించడమే ఆలస్యం.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు