ప్రేమని నిలబెట్టుకునేందుకే ఆ జంట ఏం చేస్తుందంటే..

19 Mar, 2021 15:08 IST|Sakshi

ఎవరు భర్త అవుతారో, ఎవరు భార్యగా వస్తారో తెలియకపోవడమే జీవితంలో మేజిక్. ఆ తరవాత ఒకరికోసం ఒకరు అనే భావన ఏర్పరచుకోవడం మరో మేజిక్. 'స్టార్‌ మా' సరికొత్తగా ప్రారంభించబోతున్న ధారావాహిక కోసం ముందుగా విడుదల చేసిన పాట సంచలనం సృష్టిస్తుంది. ఇది కేవలం రెండు ముఖ్యమైన పాత్రల పరిచయం. ఏ సిరులూ తన సుగుణాలతో సరితూగవని అమ్మాయి... నా కలలను నీ కనులతో చూడాలని ఆశ పడే  అబ్బాయి... ఎంత అందంగా వుంది ఈ ఊహ. పాత్రల పరంగా అది పూర్తిగా నిజం.  అలా పాట అంతా జీవితాన్ని అందమైన కోణం లో చూసిన ఇద్దరి ఆలోచనలు వినిపిస్తాయి. కనిపిస్తాయి. ఆ ప్రేమని నిలబెట్టుకునేందుకే ఆ జంట ప్రయత్నించి నిలబడుతుంది. ఈ నెల 22న (సోమవారం) ఈ సీరియల్  ప్రారంభం అవుతోంది.  సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది.

చదవండి : చిరంజీవి పాటకు స్టెప్పులేసిన బిగ్‌బాస్‌ భామ, ఫ్యాన్స్‌ ఫిదా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు